CM KCR: దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ .. సీఎస్టీ పన్ను బకాయి రద్దు: సీఎం కేసీఆర్

CST Tax Cancelled: ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భంగా ఇచ్చే 2 శాతం సీఎస్టీ పన్ను బకాయిని రద్దుచేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రైసు మిల్లర్ల ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందన్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2022, 09:11 PM IST
CM KCR: దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ .. సీఎస్టీ పన్ను బకాయి రద్దు: సీఎం కేసీఆర్

CST Tax Cancelled: వరిధాన్యం ఉత్పత్తిలో  నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. వరిధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామన్నారు. ఆ దిశగా చర్యలు చేపడుతామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భంగా ఇచ్చే (01.04.2015 నుంచి 30.06.2017 మధ్య కాలంలో) 2 శాతం సీఎస్టీ పన్ను బకాయిని రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. బియ్యం ఎగుమతులను ప్రోత్సహించి తెలంగాణ రైసు మిల్లర్ల ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. 

గతంలో ఇలా.. 

తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భంలో గతంలో  సీ-ఫారం దాఖలు చేస్తే  (సీఎస్టీ) టాక్స్‌ లో 2 శాతం రాయితీని కల్పించే విధానం ఉండేది. ఈ విధానం ఉమ్మడి రాష్ట్రంలో అమలు అయింది. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రారంభంలో అమలు చేశారు. అయితే 2015 ఏప్రిల్ 1 నుంచి 2017 జూన్ 30 మధ్య కాలంలో రాష్ట్రం నుంచి చేసిన బియ్యం ఎగుమతులకు సీ-ఫారం సబ్మిట్ చేయలేదనే కారణంతో బియ్యం ఎగుమతి దారులకు సీఎస్టీలో 2 శాతం పన్ను రాయితీ కల్పించడం నిలిపివేశారు.

దీంతో తాము ఆర్థికంగా నష్ట పోతున్నామని.. పన్ను రాయితీ కల్పించాలని గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రైస్ మిల్లర్ల అసోషియేషన్ ప్రతినిధులు అభ్యర్థిస్తూ వస్తున్నారు. బియ్యం ఎగుమతి చేశామా లేదా అనేది నిర్దారణ చేసుకోవడమే సీ ఫారం ఉద్దేశమని.. అది లేనంత మాత్రాన తమ హక్కును ఎలా రద్దు చేస్తారని వారు పలుమార్లు ప్రభుత్వంతో మొరపెట్టుకున్నారు. సీ ఫారం బదులు తాము ఎగుమతులు చేసినట్లుగా నిర్దారణ చేసుకోవడానికి ఇతర పద్దతులను పరిశీలించాల్సిందిగా కోరారు. రెండేళ్ల కాలానికి సంబంధించిన 2 శాతం పన్నును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

సోమవారం సీఎం కేసీఆర్ దామరచర్ల పర్యటన సందర్భంగా.. మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్ రావు, మంత్రి జగదీశ్ రెడ్డి , రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోషియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని ఈ సమస్యను వివరించారు. వారి అభ్యర్థనను పరిశీలించిన సీఎం.. వారికి ఎలాంటి సాయం చేయవచ్చునో ఆలోచించాలని, తక్షణమే ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. రాయితీ ఇవ్వకుండా నిలిపివేసిన 2 శాతం పన్నును రద్దు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. 

తమ అభ్యర్థనను మన్నించి తక్షణమే జీవో జారీ చేసినందుకు తెలంగాణ రైస్ మిల్లర్లు, రైతాంగం తరఫున ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌ను సోమవారం ప్రగతి భవన్‌లో కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Shradhha Murder Case: అఫ్తాబ్‌పై కత్తితో దాడికి యత్నం.. 2 నిమిషాలు టైమ్ ఇవ్వండి.. 70 ముక్కలు చేస్తాం..  

Also Read: IND Vs BAN: బంగ్లాదేశ్‌ టూర్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం.. ఈ ముగ్గురు సీనియర్లకు కోచింగ్ బాధ్యతలు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News