జాతీయ మానవహక్కుల సంఘం పంపించిన నిజ నిర్ధారణ కమిటి సభ్యులు చటాన్‌పల్లికి చేరుకుని ఎన్కౌంటర్ జరిగిన ఘటనాస్థలిని పరిశీలించారు. తొలుత మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన నిజ నిర్ధారణ కమిటి సభ్యుల బృందం.. ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను పరిశీలించింది.
షాద్‌నగర్‌కి సమీపంలోని చటాన్‌పల్లి కల్వర్టు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
''నా భర్తను ఎక్కడైతే ఎన్కౌంటర్ చేశారో.. నన్ను కూడా అక్కడికే తీసుకెళ్లి కాల్చిచంపండి. మా ఇద్దరికీ పెళ్లయి ఏడాదే అవుతోంది. ఇప్పుడు మా ఆయన లేకుండా నేనుండలేను''. దిశ హత్య కేసులో నిందితుడిగా ఉండి శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో హతమైన చింతకుంట చెన్నకేశవులు భార్య రేణుక ఆవేదన ఇది.
దిశపై సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో ఉన్న నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో తెలంగాణ పోలీసుల చర్యను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధినేతగా ఉన్న శివ సేన పార్టీ స్వాగతించింది. ఈ మేరకు శనివారం శివసేనకు చెందిన సామ్నా పత్రికలో ఓ సంపాదకీయ కథనం ప్రచురితమైంది.
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూర్ గ్రామం నుండి విధులు ముగించుకొని శంషాబాద్‌లోని తన నివాసానికి తిరిగి వస్తున్న ఓ పశు వైద్యాధికారిణి పశువాంఛ కలిగిన నలుగురు కిరాతకుల చేతిలో దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు మహిళలకు ఎంతమేరకు రక్షణ ఉందనే ప్రశ్నను మరోసారి ఉత్పన్నమయ్యేలా చేసింది.
హైదరాబాద్ జాతీయ రహదారిపై విజయవాడలోని భవానీపురం వద్ద పలువురు ఆకతాయిలు శనివారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. రహదారిపై తమ బైకులకు సైడ్ ఇవ్వలేదనే ఆగ్రహంతో రెచ్చిపోయిన యువకులు పది ద్విచక్రవాహనాలపై బస్సును వెంబడించి గొల్లపూడి సెంటర్ వద్ద బస్సును ఓవర్ టేక్ చేసి అడ్డుకున్నారు. అనంతరం బస్ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే పురుషులు ఇక పై జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఏ మాత్రం ఆదమరిచి మహిళల సీట్లలో కూర్చున్నా..ఇక ఇంతే సంగతులు. రూ.500 జరిమానా క్రింద చెల్లించాల్సిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.