తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ పరీక్ష హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ లింక్ ఇదే

తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల 

Last Updated : Sep 20, 2018, 06:21 PM IST
తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ పరీక్ష హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ లింక్ ఇదే

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ సెప్టెంబర్ 30వ తేదీన నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పరీక్ష కోసం నేటి ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులకు హాల్ టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగాన్ అయి తమ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఉన్నతాధికారులు తెలిపారు. సెప్టెంబర్ 30 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. 

హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే tslprb.in

నేటి ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి 12 గంటల వరకు హాల్ టికెట్స్ డౌన్‌లోడింగ్‌కు అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులకు తమ హాల్ టికెట్ డౌన్‌లోడింగ్‌లో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తినట్టయితే support@tslprb.in మెయిల్ ఐడీకి మెయిల్ చేయవచ్చు లేదా 93937 11110, 93910 05006 ఫోన్ నెంబర్లపై సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పేర్కొంది.

Trending News