ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ పరీక్ష.. త్వరలో పరీక్ష 'కీ'

ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ పరీక్ష.. త్వరలో పరీక్ష 'కీ'

Last Updated : Oct 1, 2018, 04:31 PM IST
ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ పరీక్ష.. త్వరలో పరీక్ష 'కీ'

తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష 2018 ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర  పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ-TSLPRB) తెలిపింది. త్వరలో పరీక్ష ‘కీ’ని తమ అధికారిక వెబ్‌సైట్‌ tslprb.inలో ఉంచుతామని పోలీస్‌ నియామక మండలి చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రశ్నపత్రంలో ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తామని.. సంబంధిత వివరాలను పీడీఎఫ్‌, జేపీజీ ఫార్మాట్‌లో 3 రోజుల్లోగా తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 30, 2018 ఆదివారం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 966 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 93.95% అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు.

మే 31న 16,925 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు (పోలీస్‌ సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, టీఎస్‌ఎస్‌పీ, ఎస్‌పీఎఫ్‌తో పాటు ఫైర్‌మెన్‌ పోస్టులు) రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు 4,78,567 మంది దరఖాస్తు చేసుకోగా 4,49,584 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దేహదారుడ్య పరీక్షకు ఎంపికవుతారు. కాగా.. ప్రాథమిక పరీక్షలో ఇంత కఠిన ప్రశ్నలు ఇవ్వడంపై సోషల్‌ మీడియాలో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Trending News