తెలంగాణ ఎస్సై ప్రిలిమినరి రాత పరీక్ష అభ్యర్థులకు ముఖ్య గమనిక

తెలంగాణ ఎస్సై ప్రిలిమినరి రాత పరీక్ష అభ్యర్థులకు ముఖ్య గమనిక !

Last Updated : Aug 23, 2018, 01:09 PM IST
తెలంగాణ ఎస్సై ప్రిలిమినరి రాత పరీక్ష అభ్యర్థులకు ముఖ్య గమనిక

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహించనున్న ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆగస్టు 24, శుక్రవారంలోగా తమ హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందని రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారులు తెలిపారు. ఆగస్టు 24న అర్ధరాత్రి 12 గంటలతో అభ్యర్థుల హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్‌ గడువు ముగియనుందని సంబంధిత అధికారులు తాజాగా మరోసారి స్పష్టంచేశారు. ఆగస్టు 26న, ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్సై ప్రిలిమ్స్ రాత పరీక్ష జరగనుంది. అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని పరిశీలించేందుకు అన్ని పరీక్షాకేంద్రాల్లో బయోమెట్రిక్ పరికరాలుసహా అధికారులు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. 

టీఎస్‌ఎల్పీఆర్బీ వెబ్‌సైట్ www.tslprb.in నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడంలో సమస్య తలెత్తినట్టయితే support<\@>tslprb.in ఈ-మెయిల్ చేయవచ్చు.  లేదా 9393711110, 9391005006 నంబర్లలో సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని బోర్డ్ తెలిపింది. అభ్యర్థులు హాల్‌టికెట్‌ను ఏ4 సైజ్‌లో రెండువైపులా వచ్చేలా ప్రింట్‌అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోను హాల్ టికెట్స్‌పై సూచించిన చోట అంటించాలి. హాల్ టికెట్స్‌పై ఫోటోలకు పిన్నులు కొట్టవద్దని, అలా చేసే అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనంలో సాంకేతిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని బోర్డు అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ స్పష్టంచేసింది. 

Trending News