Telangana: ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థల పునఃప్రారంభం

కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతబడిన సంగతి తెలిసిందే. 11 నెలల సుదీర్ఘ విరామం అనంతరం తెలంగాణలో విద్యాసంస్థలు పున:ప్రారంభించేందుకు ప్రభుత్వం (Telangana Govt) చర్యలు చేపట్టింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2021, 06:53 AM IST
Telangana: ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థల పునఃప్రారంభం

Telangana schools, colleges reopen from february 1st | హైదరాబాద్: కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతబడిన సంగతి తెలిసిందే. 11 నెలల సుదీర్ఘ విరామం అనంతరం తెలంగాణలో విద్యాసంస్థలు పున:ప్రారంభించేందుకు ప్రభుత్వం (Telangana Govt) చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను ఫిబ్రవరి 1 నుంచి పున:ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) ఆదేశించారు. 9 నుంచి ఆ పై తరగతులకు క్లాసులు నిర్వహించాలని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రులు, అధికారులు, కలెక్టర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో విద్యాసంస్థల పున:ప్రారంభంపై చర్చించారు. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR) మాట్లాడుతూ.. 9, 10, (schools, colleges) ఇంటర్‌, డిగ్రీ, ఇతర వృత్తి విద్యాకోర్సుల తరగతులను మాత్రమే నిర్వహించాలని స్పష్టంచేశారు. క్లాసుల నిర్వహణకు అనుగుణంగా ఈ నెల 25 లోగా విద్యాసంస్థలను సిద్ధం చేయాలని సూచించారు. విద్యాసంస్థలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లల్లో టాయిలెట్లు, ఇతర వసతులను, అదేవిధంగా శానిటైజ్ ప్రక్రియను సిద్ధంచేయాలని పేర్కొన్నారు. Also Read: Vijaya gadde: ట్రంప్ ట్విట్టర్ ఎక్కౌంట్ నిషేధం వెనుక తెలుగు మహిళ

కొన్ని నెలలుగా విద్యాసంస్థలు మూసిఉన్న నేపథ్యంలో భవనాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కరోనా ముందు నిల్వ చేసిన బియ్యం, పప్పు, ఆహార ధాన్యాలు, వంట సామగ్రి పురుగుపట్టే అవకాశం ఉంటుందని కొత్తగా స్టాక్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర హాస్టళ్లను సందర్శించాలని, విద్యార్థుల వసతికి అనుగుణంగా సౌకర్యాలను తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ సూచించారు.

Also Read | Indian Army: చైనా సైనికుడిని అప్ప‌గించిన భార‌త్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News