Farmers protest against Minister Indrakaran Reddy: నిర్మల్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిర్మల్ జల్లా పొన్కల్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. శనివారం అక్కడ రైతు వేదిక ప్రారంభించేందుకు వెళ్లిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్‌ని రైతులు, సాధర్మాట్ భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. Sadarmat barrage ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ నుంచి భూములు లాక్కుని మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు తమకు నష్టపరిహారం చెల్లించలేదని రైతులు నిరసన వ్యక్తంచేశారు. నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని సాధర్మాట్ ప్రాజెక్టు భూ నిర్వాసితులు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు.
Also read : GHMC Mayor elections: TRS పార్టీది రాజకీయ వ్యభిచారం.. టీఆర్ఎస్, MIM పార్టీలపై BJP నేతల ఘాటు వ్యాఖ్యలు
తమ సమస్యకు పరిష్కారం లభించే వరకు మంత్రి కాన్వాయ్‌ని ముందుకు వెళ్లనిచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పడంతో మంత్రి ఇంద్రకరణ్ ఏం చేయాలో అర్థం కాక కాసేపు తలపట్టుకున్నారు. వారికి నష్టపరిహారం వచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానని, వచ్చే మూడు నెలల్లో మీకు పరిహారం అందే ఏర్పాట్లు చేస్తానని Minister Indrakaran Reddy చెప్పినా రైతులు వినిపించుకోలేదు. భూములు పోగొట్టుకుని పంటలు పండించుకోలేక, Raithu bandhu scheme ఆర్థిక సాయం కూడా పొందలేక, చివరకు నష్టపరిహారం కూడా రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆగ్రహం (Farmers protest) వ్యక్తంచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook