GHMC Elections, Bandi Sanjay: దమ్ముంటే అరెస్ట్ చేయండి: బండి సంజయ్ సవాల్

హైదరాబాద్: హైదరాబాద్ వరద బాధితులకు అందించే వరద సాయాన్ని నిలిపేయాల్సిందిగా తాను ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి స్పష్టంచేశారు. టీఆర్ఎస్ ఒక పథకం ప్రకారమే ఫేక్ లెటర్ సృష్టించి తనను, బీజేపిని బద్నాం చేసేందుకు కుట్రపన్నిందని, ఆ లేఖపై ఉన్న సంతకం కూడా తనది కాదని బండి సంజయ్ తెలిపారు.

Last Updated : Nov 21, 2020, 08:39 PM IST
GHMC Elections, Bandi Sanjay: దమ్ముంటే అరెస్ట్ చేయండి: బండి సంజయ్ సవాల్

హైదరాబాద్: హైదరాబాద్ వరద బాధితులకు అందించే వరద సాయాన్ని నిలిపేయాల్సిందిగా తాను ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి స్పష్టంచేశారు. టీఆర్ఎస్ ఒక పథకం ప్రకారమే ఫేక్ లెటర్ సృష్టించి తనను, బీజేపిని బద్నాం చేసేందుకు కుట్రపన్నిందని, ఆ లేఖపై ఉన్న సంతకం కూడా తనది కాదని బండి సంజయ్ తెలిపారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కుట్ర పన్నినందుకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. ఎన్నికల కమిషన్ కూడా తన నుంచి ఎలాంటి లేఖ అందలేదని నిగ్గు తేల్చిందని గుర్తుచేశారు. అందుకే ఈ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

మత విద్వేషాలను రెచ్చ గొడుతున్నానని దుష్ప్రచారం..
తాను మత విద్వేషాలను రెచ్చ గొట్టేందుకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాని వెళ్లానని దుష్ప్రచారం చేస్తున్నారు కానీ అసలు నిజాలు ప్రపంచానికి తెలియజేసేందుకే తాను ఆలయాని వెళ్లానని బండి సంజయ్ ( Bandi Sanjay ) పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు బీజేపీ అంటే ఒక భయం పట్టుకుందని, అందుకే ఇలా బీజేపీని బద్నాం చేసేందుకు ఫేక్ లెటర్ సృష్టించి మరీ కుట్ర చేస్తున్నారని అన్నారు. 

Also read : GHMC Elections: బీజేపీలో చేరిన సర్వే సత్యనారాయణ.. కాంగ్రెస్‌పై ఘాటు వ్యాఖ్యలు 

భాగ్యలక్ష్మీ అమ్మవారి చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారు:
భాగ్యలక్ష్మీ అమ్మవారి ( Hyderabad Bhagyalaxmi temple ) చరిత్ర తెలియకుండా కొందరు తమకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసిన బండి సంజయ్.. ఆ గుడి ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా ? లేక బాంగ్లాదేశ్‌లో ఉందా ? అదీ కాకపోతే ఆఫ్ఘనిస్థాన్‌లో ఉందా ? అని ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి కారణంగానే హైదరాబాద్‌కు భాగ్యనగరం అనే పేరు వచ్చిందని గుర్తుచేస్తూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే  ఎంఐఎం పార్టీకి ఓటు వేసినట్లేనని అన్నారు. ఎంఐఎం పార్టీకి మేయర్ పదవి అప్పగిస్తే ఆ తర్వాత ఇక ఏ గుడికీ వెళ్లకుండా చేస్తారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Also read : TRS MP D Srinivas: ఎక్కడి అభివృద్ధి.. ఏం అభివృద్ధి..: సీఎం కేసీఆర్‌పై సొంత పార్టీ ఎంపీ డిఎస్ ఘాటు వ్యాఖ్యలు

20 శాతం ఉన్న ముస్లింల గురించి..
నగరంలో 20 శాతం ఓటర్లు ఉన్న ముస్లింల ( Muslim population in Hyderabad ) గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ రెచ్చగొట్టినట్టు మాట్లాడితే తప్పు లేదు కానీ... తాను 80 శాతం మంది ఉన్న హిందువుల ( Hindu population in Hyderabad ) గురించి మాట్లాడితే తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటున్నారని అధికార టీఆర్ఎస్ పార్టీని నిలదీశారు. ఒకవేళ తాను తప్పు చేశాననే భావిస్తే.. దమ్ముంటే అరెస్టు చేయండి అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రేపే బీజేపి మేనిఫెస్టో ( GHMC Elections BJP manifesto ) రిలీజ్ చేసి అనేక ప్రజా సమస్యలపై బీజేపి వైఖరి ఏంటో స్పష్టంచేస్తామని బండి సంజయ్ స్పష్టంచేశారు.

Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

 

Trending News