Rythu Bandhu: నేటినుంచి ‘రైతుబంధు’ సాయం పంపిణీ

తెలంగాణ వ్యాప్తంగా నేటినుంచి రెండో విడత రైతుబంధు పథకం ప్రారంభం కానుంది. రైతుబంధు సాయాన్ని భూమి ఉన్న ప్రతీ ఒక్క రైతుకు అందించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

Last Updated : Dec 28, 2020, 11:18 AM IST
Rythu Bandhu: నేటినుంచి ‘రైతుబంధు’ సాయం పంపిణీ

Telangana - Rythu Bandhu second phase distribution start today: హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా నేటినుంచి రెండో విడత రైతుబంధు పథకం ప్రారంభం కానుంది. రైతుబంధు సాయాన్ని భూమి ఉన్న ప్రతీ ఒక్క రైతుకు అందించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు నేటినుంచి పది రోజులపాటు రైతుబంధు సాయం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

అయితే రాష్ట్రవ్యాప్తంగా 61.49 లక్షల మంది రైతులు (farmers) ఈ పెట్టుబడి సాయాన్ని పొందనున్నారు. ఎకరానికి ఐదువేల చొప్పున 1.52 కోట్ల ఎకరాల సాగుభూమికి ఆయా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం (Rythu Bandhu Scheme) జమ కానుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రూ.7,515 కోట్ల బడ్జెట్‌ కేటాయించింది. Also Read: KCR: MSP ల వల్ల తెలంగాణకు రూ.7500 కోట్ల నష్టం

ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో యాసంగి రైతుబంధు పంపిణీపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రైతుబీమా, పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగువిధానం, రైతుబంధు సమితుల బాధ్యతలు తదితర అంశాలపై చర్చించారు. పది రోజుల వ్యవధిలోనే రైతులందరీ ఖాతాల్లో యాసంగి పెట్టుబడి సాయం జమకావాలని సూచించారు. Also Read: Double Bedroom అమ్మితే కేసు నమోదు చేస్తాం: హరీశ్‌రావు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News