ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగం భారీగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో ట్విటర్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగి వుండటాన్ని ప్రముఖులు ప్రతిష్టాత్మకంగానూ తీసుకుంటున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ గుర్తుంది కదా.. అవును 'కహోనా ప్యార్ హై' అంటూ సరిగ్గా 17 ఏళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో
ఆస్ట్రేలియా అడవుల్లో తిరిగే కొండచిలువ జాతిలో దాదాపు 7 అడుగుల పొడవైన సర్పాన్ని గుర్తించారు. ఇది క్వీన్స్ ల్యాండ్ కు ఉత్తరాన వుజుల్ వుజుల్ అడవిలో డ్యూటీ చేస్తున్న ఓ పోలీసు అధికారి కంటబడింది ఈ పొడవైన క్రూబ్ పైథాన్ పాము. ఏమాత్రం ఆసల్యం చేయకుండా వెంటనే ఆ పామును తన కెమెరాలో బంధించిన అధికారి..ఆ దృశ్యాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు . ప్రస్తుతం ఆ పోస్టును 20 లక్షల మందికి పైగా చూశారు. దీనికి పదివేల మంది కామెంట్లు పెట్టడం గమనార్హం.
వాట్సాప్ లో పొరపాటు సందేశం పంపితే .. ఇంకే ముంది.. అంతే సంగతులు. దానికి వివరణ ఇవ్వడం తప్పితే వేరే దారి లేదు.. అయితే ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండదు. మనం చేసే పోరపాటు సందేశాన్ని రీకాల్ చేసుకునే కొత్త ఫీచర్ వాట్సాప్ లో వచ్చేసింది.
కొత్త ఫీచర్ గురించి మరింత వివరంగా...
ఫేస్బుక్ వారి ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రాం సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. తాజాగా ప్రవేశపెట్టిన ఫీచర్ ద్వారా గతంలో కంటే ఇప్పుడు లైవ్‌లో ఎక్కువ మంది పాల్గొనే అవకాశం కల్పించింది. గత నవంబర్‌లో లైవ్ ఫీచర్ ప్రవేశపెట్టిన నాటి నుంచి చాలా మంది ఆ సదుపాయాన్ని వాడుకునేందుకు ఆసక్తి చూపించారు. తమకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఫొటోల కంటే లైవ్‌ల ద్వారా అందించేందుకే మొగ్గు చూపారు. అలా లైవ్ చేసే వారి కోసం ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ని ఇన్స్టాగ్రాం అందించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రవేశపెట్టిన ఫీచర్‌తో గతం కంటే ఎక్కువ మంది లైవ్ లో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది.
దేశంలో జీఎస్టీ అమలవుతున్నప్పటి నుంచి ఒక్కో ప్రముఖులు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. తాజాగా క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా జీఎస్టీపై సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఈ కామెంట్ పై పలువురు నెటిజన్లు బజ్జీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఆయనేం కామెంట్ చేశారంటే .. "రెస్టారెంట్లో భోజనం చేసి బిల్లు కడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి భోజనం చేసిన ఫీలింగ్ వస్తోంది" అని పోస్ట్ చేశారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. ప్రముఖ క్రికెటర్లే ఇలా ఫీలయితే, సామాన్యమానవుడి పరిస్థితి ఏంటీ? అని ఒకరు, ఇదివరకైతే విడివిడిగా భోంచేసేవారని, ఇప్పుడు కలిసి భోంచేస్తున్నారని మరొకరు కామెంట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.