8th Pay Commission New Update: 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తరువాత కీలకమైన అప్‌డేట్ వెలువడింది. ముఖ్యంగా ఉద్యోగుల కనీస వేతనం ఎంతవరకు పెరుగుతుందనే విషయంపై స్పష్టత వచ్చింది. 8వ వేతన సంఘం ప్రకారం ఉద్యోగుల కనీస వేతనం ఏకంగా 30 శాతం పెరగబోతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దిమ్మ తిరిగే అప్‌డేట్ ఇది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం పలకడంతో జీతభత్యాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ఎంత పెరుగుతుందనే ప్రశ్నలు మొదలయ్యాయి. ముఖ్యంగా కనీస వేతనం ఎంత పెరుగతుందనేది ప్రధాన ప్రశ్నగా మారింది. దీనిపై ఇప్పుడు దాదాపు స్పష్టత వచ్చిది. 8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.6 నుంచి 2.85కు పెరగనుందని అంచనా ఉంది. అదే జరిగితే కనీస వేతనం 25-30 శాతం పెరగబోతోంది. అంటే ప్రస్తుతం 18 వేల రూపాయలున్న కనీస వేతనం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతానికి చేరడంతో 40 వేల నుంచి 45 వేలు కానుందని తెలుస్తోంది.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకం. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు లెక్కించేందుకు ఇదే ఆధారం. ఇది ద్రవ్యోల్బణ, ఆర్ధిక పరిస్థితులు, అవసరాలను బట్టి నిర్ణయింపబడుతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత పెరిగితే జీతభత్యాలు అంతగా పెరుగుతాయి. ప్రస్తుతం అంటే 7వ వతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57శాతముంది. 6వ వేతన సంఘంలో ఇది 1.86 శాతంగా ఉంది. దాంతో అప్పట్లో 9 వేలున్న కనీస వేతనం ఏకంగా 18 వేల రూపాయలైంది.
పెన్షన్ ఎంత పెరుగుతుంది
8వ వేతన సంఘంతో కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలే కాకుండా రిటైర్ ఉద్యోగుల పెన్షన్ కూడా పెరగనుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 శాతం పెంచేందుకు ప్రభుత్వం అంగీకరిస్తే పెన్షన్ ఏకంగా 186 శాతం పెరగవచ్చు. అంటే ఇప్పుడు 9 వేల రూపాయలుగా ఉన్న పెన్షన్ 25,740 రూపాయలకు చేరవచ్చు. ఇది పెన్షనర్లకు అతి పెద్ద రిలీఫ్ కానుంది. వేతన సంఘం అనేది 1946 నుంచి వస్తోంది. ఇప్పటి వరకు 7 వేతన సంఘాలు ఏర్పడ్డాయి. ఇది ప్రతి పదేళ్లకోసారి ఏర్పడుతుంటుంది. 7వ వేతన సంఘం 2016 నుంచి అమల్లోకి వచ్చింది. 2026 వరకూ ఉంటుంది. ఇప్పుడు ఏర్పడనున్న 8వ వేతన సంఘం 2027 నుంచి అమలు కావచ్చు.
Also read: February 2025 Bank Holidays: ఫిబ్రవరిలో ఆ 14 రోజులు సెలవులే, జాబితా ఇదిగో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి