Padma Shri Manda Krishna Madiga: ఎస్సీ కులాల్లో ఎక్కువ రిజర్వేషన్స్ అందులోని ఇతర కులాల వారే అనుభవిస్తున్నారని తెలుసుకొని .. ఎస్సీలను వర్గీకరించాలని గత 3 దశాబ్దాలుగా ఉద్యమాన్ని నడిపిస్తున్న నాయకుడు. అంతేకాదు ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య శ్రీ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాల వెనక స్పూర్తి కూడా మంద కృష్ణ మాదిగ అని చెప్పాలి.అప్పట్లో దివ్యాంగులు, గుండె సంబంధిత వ్యాధులతో పోరాడుతున్న చిన్నారుల వైద్య చికిత్స కోసం ఆందోళనలు నిర్వహించి ఈ పథకాలు ప్రభుత్వాలు అమలు చేసేలా చేయడంలో సఫలీకృతుడయ్యారు.
మంద కృష్ణ 1965 జూలై 7న ఉమ్మడి వరంగల్ జిల్లాలో న్యూశాయంపేటలో మంద కొమురయ్య, కొమురమ్మ దంపతులకు జన్మించారు. 80వ దశకంలోనే కుల వివక్షపై విద్యార్థి గా ఉన్నపుడే పోరాడారు. అంతేకాదు అప్పటి పీపుల్స్ వార్ లో పనిచేసారు మంద కృష్ణ. ఆ తర్వాత నక్సల్స్ ఉద్యమం నుంచి బయటకు వచ్చి తన తోటి మాదిగ కోసం నడుం బిగించారు. దళితుల్లో అత్యంత వెనకబడిన కులాలకు న్యాయం చేయాలనే 1994లో ఎమ్మార్పీస్ (మాదిగ రిజర్వేషన్ పోారట సమితి)ని స్థాపించారు.
అప్పట్లో 1997లో నారావారి పల్లె నుంచి హైదరాబాద్ వరకు 50 రోజులు పాటు సుమారు 1052 కిలోమీటర్ల పాదయాత్రతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు. ఆ తర్వాత 2007లో మేలో నిరవధిక నిరాహార దీక్ష చేశారు. గతేడాది ఆగష్టులో సుప్రీంకోర్టు ఎస్పీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.దాన్ని అమలు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. 2004లో అప్పట్లో గుండె సంబంధింత వ్యాధులతో బాధపడుతున్న పిల్లల కోసం చేసిన ర్యాలీ సంచలనం సృష్టించింది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించి చిన్న పిల్లలకు ఆపరేషన్స్ చేయించారు. అప్పట్లో ఫిజికల్ చాలెంజ్ వారి కోసం 2007లో మంద కృష్ణ అప్పటి హైదరాబాద్ నిజాం కాలేజ్ లో చేసిన మహా గర్ఝన నిర్వహించారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చి పింఛన్ ప్రకటించారు. అంతేకాదు ముసలివారు. వితంతుల తరుపున కులాలకు అతీతంగా తన వంతు పోరాటం నిర్వహించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
గత మూడు దశాబ్దాలుగా మేం చేస్తోన్న పోరాటానికి దక్కిన గౌరవం పద్మశ్రీ అవార్డు అని మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. నన్ను గుర్తించి అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ధన్యవాదాలు తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతను రెట్టింపు చేసిందన్నారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.