వాట్సాప్ కొత్త ఫీచర్; పొరబడితే తప్పు దిద్దుకునే ఛాన్స్

Last Updated : Jan 19, 2018, 02:02 PM IST
వాట్సాప్ కొత్త ఫీచర్; పొరబడితే తప్పు దిద్దుకునే ఛాన్స్

వాట్సాప్ లో  పొరపాటు సందేశం పంపితే .. ఇంకే ముంది.. అంతే సంగతులు. దానికి వివరణ ఇవ్వడం తప్పితే వేరే దారి లేదు.. అయితే ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండదు. మనం చేసే పోరపాటు సందేశాన్ని రీకాల్ చేసుకునే కొత్త ఫీచర్ వాట్సాప్ లో వచ్చేసింది. 

కొత్త ఫీచర్ గురించి మరింత వివరంగా...

ప్రస్తుతం వాట్సాప్‌లో పొరపాటున మనం ఎవరికైనా సందేశం పంపితే దాన్ని తొలగించే అవకాశం లేదు... దీన్ని వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మనం ఎవరికైనా పొరపాటున సందేశం పంపితే వెంటనే దాన్ని తొలగించుకునే వీలు కల్పించింది. కేవలం వ్యక్తిగత సందేశాలకు మాత్రమే కాకుండా గ్రూప్‌లో పొరపాటున పెట్టిన సందేశాలను కూడా రీకాల్‌ చేసుకోవచ్చు. రీకాల్ తో పాటు మనం పంపిన సందేశాలను ఎడిట్‌ చేసుకునే ఆప్షన్‌ కూడా వాట్సాప్‌ అందిస్తోంది

కండీషన్స్ ఇవే...

* మెసేజ్‌లు రీకాల్‌ అవ్వాలంటే అవతలి వ్యక్తి కూడా తన వాట్సాప్‌ను కొత్త వెర్షన్‌తో అప్‌డేట్‌ చేసుకోవడం తప్పనిసరి..
* అవతలి వ్యక్తి ఆ సందేశాలను చదివేలోపు మాత్రమే వాటిని తొలగించే వీలుంటుంది
* కొత్త ఫీచర్‌ను దశల వారీగా అమలు చేస్తామంటున్న  వాట్సాప్‌.

Trending News