ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంలో మరో నయా పంథాను మొదలుపెట్టారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో తమ డిస్‌ప్లే పిక్‌ని మార్చుకోవాల్సిందిగా నారా లోకేష్ ఏపీ నెటిజెన్స్‌కి పిలుపునిచ్చారు. 5 కోట్ల మంది ఆకాంక్షలు ప్రతిరూపంలో ఈ నిరసన వుండాలన్న లోకేష్.. ఆ డిస్‌ప్లే పిక్‌లో మొదటి భాగాన్ని నల్ల రంగులోకి మార్చడంతోపాటు నల్ల బ్యాడ్జి ధరించి తీసుకున్న సెల్ఫీని రెండోవైపున వుండేలా డిజైన్ చేసిన డిస్‌ప్లే పిక్‌ని పోస్ట్ చేయాల్సిందిగా పేర్కొన్న లోకేష్.. #APWearsBlackBadge అనే హ్యాష్ ట్యాగ్‌తో తమ నిరసనను కేంద్రానికి తెలియచేద్దాం అని అన్నారు.
Let us stand united in making voices of 5 crore citizens of AP heard. To protest the injustice meted out to us by the Centre, change your display pictures to black (Pic 1). Participate in this movement by posting selfie with a black badge (pic 2) & hashtag with #APWearsBlackBadge pic.twitter.com/y09oJcNdAO
— Lokesh Nara (@naralokesh) March 29, 2018
5 కోట్ల మంది ఆంధ్రులని ఈ డిజిటల్ మూవ్‌మెంట్‌లో భాగస్వాములు కావాల్సిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు.