ప్రముఖుల ట్విటర్ ఖాతాల్లో ఫాలోవర్స్ పెరగడానికి ఇదే సీక్రెటా ?

ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగం భారీగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో ట్విటర్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగి వుండటాన్ని ప్రముఖులు ప్రతిష్టాత్మకంగానూ తీసుకుంటున్నారు.

Last Updated : Mar 19, 2018, 12:05 AM IST
ప్రముఖుల ట్విటర్ ఖాతాల్లో ఫాలోవర్స్ పెరగడానికి ఇదే సీక్రెటా ?

ప్రపంచంలో చాలామంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు భారీ సంఖ్యలో ట్విటర్ ఫాలోవర్స్ వున్నారు. ఒక విధంగా ట్విటర్‌లో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్‌ని కలిగి వుండటం అనేది వారి ఫ్యాన్ ఫాలోయింగ్‌కి ఓ కొలమానంగా భావించే వాళ్లూ లేకపోలేదు. అంతేకాదు... ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగం భారీగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో ట్విటర్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగి వుండటాన్ని ప్రముఖులు ప్రతిష్టాత్మకంగానూ తీసుకుంటున్నారు. అయితే, తెల్లనివన్నీ పాలు కావు అన్న చందంగా వాళ్ల ఎకౌంట్స్‌లో వున్న ఫాలోవర్స్ కూడా వాస్తవమైన ఫాలోవర్స్ కారు.. నకిలీ అని తెలిస్తే ఎలా వుంటుంది ? 

అవును, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రముఖులని ఫాలో అవుతున్న వాళ్లలో చాలావరకు నకిలీ ఫాలోవర్సే వున్నారట. ట్విప్లోమసి అనే డిజిటల్ స్ట్రాటెజీ సంస్థ వెల్లడిస్తే కానీ ట్విటర్ ఫాలోవర్స్‌లోనూ నకిలీల బెడద వుందనే సంగతి చాలామందికి తెలియలేదు. ట్విప్లోమసి వెల్లడించిన వివరాల ప్రకారం మన ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్లు కూడా ఈ ఫేక్ ఫాలోవర్స్ కలిగి వున్న ప్రముఖుల జాబితాలో వున్నారు. 

మోదీకి ట్విటర్‌లో మొత్తం 40,993,053 ఫాలోవర్స్ వుండగా.. అందులో 16,191,426 ఫాలోవర్స్ మాత్రమే అసలైన వారు కాగా మిగతా 24,799,527 ఫాలోవర్స్ నకిలీ ట్విటర్ యూజర్సే అని ట్విప్లోమసి తేల్చేసింది. ఇక రాహుల్ గాంధీ విషయానికొస్తే, ఆయన ట్విటర్ ఖాతాలో 3,696,460 నకిలీ ఫాలోవర్స్ వుండగా 1,715,634 ఒరిజినల్ ట్విటర్ యూజర్స్ మాత్రమే కాంగ్రెస్ బాస్‌ని ఫాలో అవుతున్నారు. 

ట్విప్లోమసి చేసిన ఓ ట్వీట్ ప్రకారం ప్రపంచంలో పలువురు ప్రముఖులకు వున్న నకిలీ ఫాలోవర్స్ సంఖ్య ఇలా వుంది. 

 

Trending News