ప్రస్తుతం సోషల్ మీడియాలో చెప్పుల వార్ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీపై చెప్పు విసిరితే బహుమతి ఇస్తానని ఒకరు ట్విట్టర్ లో ప్రకటించగా.. మోడీపై కాదు.. కేజ్రీవాల్ పై చెప్పు విసురుతానని కౌంటర్ ఇచ్చారు మరోకరు. ఇలా మొదలైంది ఈ వార్. వివరాల్లోకి వెళ్లినట్లయితే...
సుబ్రమణియన్ ట్వీట్.
మోడీపై వివాదాస్పద ట్వీట్ చేసింది ప్రముఖ యాడ్ మేకర్ సుబ్రమణియన్. కాగా ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. ఈ ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. మోడీపై కాదు.. కేజ్రీవాల్ మీద 1000 కే చెప్పువిసరుతామంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ట్వీట్ కు పద్మావతి కారణం !
పద్మావతి సినిమా వివాదంలో దీపికా పదుకునే తలను తెచ్చిన వారికి కోట్లలో బహుమతి అంటూ ఓ బీజేపీ నేత ప్రకటించడానికి వ్యతిరేకంగా సుబ్రమణియన్ ఈ ట్వీట్ చేసినట్లు తెలిసింది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సుబ్రమణియన్ ప్రచారం చేశాడు. దీంతో ఆయన చేసిన ట్వీట్ వెనకాల కేజ్రీవాల్ హస్తమందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్వీట్ కు బదులిస్తూ కేజ్రీవాల్ మీద 1000 కే చెప్పువిసరుతామంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఓవర్ ఆల్ గా చూసినట్లయితే ఈ ట్వీట్ కు మిశ్రమ స్పందన వస్తోంది.
Not at all... I am offering 1 Lakh to anyone who throws a chappal/shoe at @narendramodi ji. Welcome to the new Indian culture. Foundation laid by @BJP4India https://t.co/gEh5nxUGq7
— Ram Subramanian (Voice Of Ram) (@VORdotcom) November 20, 2017