సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ నటులను దూషిస్తున్న మీడియా ఛానళ్లు, యూట్యుబ్ ఛానళ్లపై హీరో నాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల పలు మీడియా ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు చిత్ర పరిశ్రమను దూషించటం పైనే దృష్టి సారిస్తున్నాయని, దయచేసి అలాంటివి ఆపేయాలని అన్నారు. ఇటీవల ఓ యాంకర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, భవిష్యత్ కు పునాది వేయడంలో మీడియాదే ముఖ్యపాత్ర అని గుర్తించుకోవాలని హితబోధ చేశాడు. 'పిల్లలు చూస్తున్నారు..ఇక ఆపండి' అంటూ నాని చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అయ్యింది.
Strongly condemn the way our TV channels and their hosts and a few YouTube channels are constantly focusing on maligning the film industry. Remember, our media plays an important role in shaping the future.
Kids are watching .. enough .. Stop it!!— Nani (@NameisNani) March 27, 2018
ఇటీవల ఓ టీవీ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో.. సినీ పరిశ్రమని ఉద్దేశించి సదరు టీవీ ఛానల్ వ్యాఖ్యాత చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఇండస్ట్రీలోని నటీనటులంతా ఖండిస్తున్నారు. ఈ ఉదంతంపై ‘మా’ సభ్యులు పోలీసులను కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరో పక్క మంచు లక్ష్మి సహా పలువురు నటీమణులు దీనిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు.