రంగస్థలం సినిమాలో క్లైమాక్స్‌కి ముందు వచ్చే "ఓరయ్యో నా అయ్య" సెంటిమెంట్ సాంగ్ ఆ సినిమాకు ఆయువు పట్టుగా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్‌లో చంద్రబోస్ రచించి, స్వయంగా పాడిన పాట ఆడియెన్స్ గుండెలను పిండేసింది. సినిమాలోని సన్నివేశాలను, కథాంశం ఇతివృత్తం మొత్తాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన పాట ఇది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు అన్నయ్యగా ఆది పినిశెట్టి పోషించిన కుమార్ బాబు పాత్ర మృతిచెందినప్పుడు.. రంగస్థలాన నీ పాత్ర ముగిసిందంటూ బ్యాగ్రౌండ్లో వచ్చే ఈ పాట ఆడియెన్స్ ని ఏడిపించినంత పనిచేసింది. రంగస్థలం మ్యూజిక్ పార్ట్నర్స్లో ఒకటైన టీ సిరీస్ తెలుగు తాజాగా ఈ పాటను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది.
‘రంగస్థలం’ సినిమా గురించి ప్రస్తావించాల్సి వస్తే మొట్టమొదటగా మాట్లాడుకోవాల్సింది ఈ సినిమా కథ, దాని నేపథ్యం గురించే. 1980 లలోని పల్లె వాతావరణంతో పాటు, అప్పటి లైఫ్ స్టైల్స్ తో అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని 1980 లోకి తీసుకు వెళ్ళడం గ్యారంటీ
రంగస్థలం సినిమా ఆడియెన్స్ ముందుకు రావడానికి మరో రెండు రోజులే మిగిలి వుందన్న తరుణంలో ఆ సినిమాలో నటించిన యాంకర్ అనసూయ ఓ ఆసక్తికరమైన ఫోటోని ట్విటర్లో పోస్ట్ చేసింది.
ఓవైపు దర్శకుడిగా ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంటూనే మరోవైపు నిర్మాతగా తాను మరో సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు సుకుమార్.
ఓంకార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సినిమా ‘రాజుగారి గది 2’. మలయాళ సినిమా ‘ప్రేతమ్’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్ర నిర్మాతలు సినీ ప్రమోషన్లో భాగంగా ఓ పోస్టరును విడుదల చేశారు. ఈ పోస్టరులో సమంత టీచర్ గెటప్‌లో కనువిందు చేస్తూ .. క్లాస్ రూములో విద్యార్థుల ముందు బెత్తంతో నవ్వుతూ కనిపించడం కొసమెరుపు. తెల్ల పంచె, లాల్చీతో ఉన్న ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ చిత్రంలో సమంత పాత్ర ఏమిటి అన్న విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అక్టోబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.