సుకుమార్‌కి ఆమె నో చెబితే, అనసూయ యస్ చెప్పిందట!!

రంగస్థలం సినిమాలో అనసూయకు అవకాశం రావడానికి పరోక్షంగా ఓ హీరోయిన్ కారణం అనే సంగతే చాలామందికి తెలియదు.

Last Updated : Mar 16, 2018, 10:22 PM IST
సుకుమార్‌కి ఆమె నో చెబితే, అనసూయ యస్ చెప్పిందట!!

రంగస్థలం సినిమాలో యాంకర్ అనసూయ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం అనసూయ చేసే పాత్ర కొంత నిడివి వున్నదే అయినా.. తగిన ప్రాధాన్యత కలిగి వున్న పాత్ర అని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో అనసూయకు అవకాశం రావడానికి పరోక్షంగా ఓ హీరోయిన్ కారణం అనే సంగతే చాలామందికి తెలియదు. అవును, అనసూయకు ఈ ఆఫర్ రావడానికి కారణం సుకుమార్ నిర్మించిన కుమారి 21ఎఫ్ ఫేమ్ హీరోయిన్ హెబ్బా పటేల్ ఆ పాత్రకు నో చెప్పడమేనట. అనసూయ చేసిన పాత్రను పోషించే అవకాశం ముందుగా హెబ్బా పటేల్‌ తలుపు తట్టిందట. అయితే, హెబ్బా పటేల్ మాత్రం అప్పటికే తన చేతిలో ఫీమేల్ లీడ్ రోల్ పాత్రలతో సినిమాలు రెడీగా వుండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేనని సున్నితంగానే తిరస్కరించిందని టాక్. 

అలా హెబ్బా పటేల్ సుకుమార్‌కి నో చెప్పిన తర్వాత ఆ ఆఫర్ యాంకర్ అనసూయను వరించింది. సుకుమార్ లాంటి పెద్ద దర్శకుడు, రామ్ చరణ్-సమంత లాంటి స్టార్ హీరో, హీరోయిన్స్‌ని జంటగా పెట్టి  తెరకెక్కిస్తున్న సినిమా కావడం, అందులోనూ మైత్రి మూవీ మేకర్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన బ్యానర్ నిర్మిస్తున్న సినిమా అవడంతో అనసూయ వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుందట. అవండీ యాంకర్ అనసూయకు రంగస్థలం సినిమాలో అవకాశం లభించడానికి ముందు జరిగిన పరిణామాలు. 

Trending News