రంగస్థలం టీజర్: చిట్టి బాబు.. ఓ సౌండ్ ఇంజనీర్

రంగస్థలం 1985 టీజర్ మెగా పవర్ స్టార్ అభిమానులని విశేషంగా అలరిస్తోంది. 

Last Updated : Jan 25, 2018, 11:07 AM IST
రంగస్థలం టీజర్: చిట్టి బాబు.. ఓ సౌండ్ ఇంజనీర్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అప్‌కమింగ్ సినిమా రంగస్థలం 1985 టీజర్ విడుదలైంది. టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ పాత్ర తీరుతెన్నులు, గోదావరి తీరంలో షూటింగ్, గ్రామీణ నేపథ్యంలోని కథాంశం, సినిమా టైటిల్ లాంటివన్నీ మొదటి నుంచి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ వస్తున్నాయి. అభిమానుల అంచనాలకు తగినట్టుగానే తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసిన రంగస్థలం 1985 టీజర్ సైతం వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా తాను సౌండ్ ఇంజనీర్‌ని అంటూ తనకి వున్న వినికిడి లోపాన్ని పరిచయం చేసుకున్న తీరుతోనే ఈ టీజర్‌లో కామెడీని మొదలుపెట్టాడు చెర్రీ. కేవలం కామెడీనే కాకుండా అభిమానులకి కావాల్సినంత యాక్షన్ సన్నివేశాలు కూడా వున్నాయని చెప్పేందుకు శాంపిల్‌గా క్షణకాలంపాటు కళ్లముందు మెదిలే పవర్‌ఫుల్ దృశ్యాలని ఈ టీజర్‌లో చూపించి 'రంగస్థలం'పై అంచనాలని రెట్టింపు చేయడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ సుకుమార్. 

 

చెర్రీ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అనసూయ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు రంగస్థలం టీజర్ చూశాం. ఇక సినిమా ఎలా వుంటుందో తెలియాలంటే మార్చి 30వ తేదీ వరకు వేచిచూడకతప్పదు. 

Trending News