'రంగస్థలం' ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా ?

 మార్చి 18న ఉగాది రోజున బీచ్ సిటీ వైజాగ్‌లో జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ ఇంకెవరో కాదు... 

Last Updated : Mar 16, 2018, 10:57 AM IST
'రంగస్థలం' ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా తెరకెక్కిన రంగస్థలం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మార్చి 18న ఉగాది రోజున బీచ్ సిటీ వైజాగ్‌లో జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ ఇంకెవరో కాదు... మెగాస్టార్ చిరంజీవే. అవును, తాజాగా ఇదే విషయమై చిత్ర నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్, సి.వి. మోహన్ ఓ ప్రకటన విడుదల చేశారు. రంగస్థలం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి మెగాస్టార్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారని ప్రకటించిన మేకర్స్.. ఈ ఈవెంట్ నిర్వహణ కోసం సహకరిస్తోన్న వైజాగ్ పోలీస్ కమిషనర్ విజయానంద్, మునిసిపల్ కమిషనర్ నారాయణకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
  
ఆర్కే బీచ్ వేదికగా జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి చాలా ప్రత్యేకతలు వుండనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు అభిమానులని అలరిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజిషన్‌లో రూపొందిన 'రంగస్థలాన', 'ఎంత సక్కగున్నావే', 'రంగమ్మ మంగమ్మ' లాంటి పాటలు డీఎస్పీ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తున్నాయి. 

ఇదిలావుంటే, ఈ సినిమాలోని రంగమ్మ మంగమ్మ పాట తమ మనోభావాలు దెబ్బతీసేదిగా వుందంటూ అఖిల భారత యాదవ సంఘం అభ్యంతరాలు వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను తొలగించకపోతే, వైజాగ్‌లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ అడ్డుకుంటాం అని సదరు యాదవ సంఘం నేత రాములు యాదవ్ స్పష్టంచేశారు. ఆందోళనకారుల డిమాండ్‌కి నిర్మాతలు తలొగ్గి, ఆ పాటను సినిమాలోంచి తొలగిస్తారా లేక ఈ వివాదాన్ని లైట్ తీసుకుని ఈ ప్రీ రీలీజ్ ఫంక్షన్‌ని నిశ్చింతగా జరుపుకోవడానికే ప్లాన్ చేసుకుంటారా వేచిచూడాల్సిందే మరి.  

Trending News