వివాదంలో 'రంగస్థలం'.. వినకపోతే విడుదల అడ్డుకుంటాం

ఈ నెల ఆఖరులో రిలీజ్ కానున్న రంగస్థలం సినిమాకు సంబంధించిన ఓ పాట ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. 

Last Updated : Mar 16, 2018, 10:56 AM IST
వివాదంలో 'రంగస్థలం'.. వినకపోతే విడుదల అడ్డుకుంటాం

ఈ నెల ఆఖరులో రిలీజ్ కానున్న రంగస్థలం సినిమాకు సంబంధించిన ఓ పాట ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో రంగమ్మ మంగమ్మ అనే పాట యాదవ మహిళల మనోభావాలను కించపర్చేలా వుందని అభ్యంతరాలు వ్యక్తంచేసిన అఖిల భారత యాదవ సంఘం నాయకుడు రాములు యాదవ్.. ఆ పాటను చిత్రంలోంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గొల్లభామ వచ్చి నా గోరు గిచ్చుతోంటే అనే చరణం యాదవ మహిళలను అవమానపర్చేదిగా వుందన్న రాములు యాదవ్.. సినిమాలోంచి ఆ పాటను తొలగించకపోతే, మార్చి 18న జరగనున్న ప్రి-రిలీజింగ్ ఫంక్షన్ ని వేలాదిగా వచ్చి అడ్డుకుంటాం అని చిత్ర దర్శకుడు, నిర్మాతలను హెచ్చరించారు రాములు యాదవ్. అప్పటికీ వినకపోతే, ఈ నెల ఆఖరున సినిమా విడుదలను సైతం అడ్డుకుంటాం అని రాములు యాదవ్ తేల్చిచెప్పారు.
 
రంగస్థలం 1985 సినిమా కోసం ''రంగమ్మ మంగమ్మ'' పాట రాసిన చంద్రబోస్, దర్శకుడు సుకుమార్ తీరును ఈ సందర్భంగా రాములు యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, ఆది పినిశెట్టి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

 

ఈ వివాదం సంగతి ఎలా వున్నా.. వారం రోజుల క్రితం టీ-సిరీస్ తెలుగు యూట్యూబ్ ఛానెల్ ద్వారా మేకర్స్ రిలీజ్ చేసిన ఈ లిరికల్ సాంగ్‌ అప్పుడే 10 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.

Trending News