Covifor Price | కరోనా వైరస్‌ను అరికట్టేందుకు దేశీయంగా తయారవుతున్న రెమ్‌డెసివర్ మెడిసిన్ ‘కోవిఫర్’(COVIFOR Injection) అందుబాటులోకి వచ్చింది. కోవిడ్19 పేషెంట్లకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్న జనరిక్ మెడిసిన్ రెమ్‌డిసివర్‌ను దేశీయంగా పంపిణీ ప్రారంభించినట్లు ఔషద సంస్థ హెటిరో బుధవారం ప్రకటించింది. దాంతో పాటుగా ఆ కరోనా మెడిసిన్ కోవిఫర్ ధరను రూ.5,400 నిర్ణయించినట్లు తెలిపారు. రెమ్‌డెసివర్ బ్రాండ్ కరోనా మెడిసిన్‌ను కోవిఫర్ పేరుతో ఆవిష్కరించడం తెలిసిందే. నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే SBIలో జాబ్స్
కోవిఫర్ 100 ఎంజీ వయల్ ఇంజక్షన్(Covifor Injection) రూపంలో లభిస్తుంది. దీని ధర(Covifor Price In India)ను రూ.5,400గా నిర్ణయించిన హెటిరో సంస్థ కోవిఫర్ పంపిణీ ప్రారంభించింది. కోవిడ్19 తీవ్రత అధికంగా ఉన్న హైదరాబాద్, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, ముంబైలలో వెంటనే కరోనా మెడిసిన్ కోవిఫర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. మరో వారం రోజుల్లో విజయవాడ, కోచి, త్రివేండ్రం, భువనేశ్వర్, రాంచీ, గోవా, దేశంలోని ఇతర ముఖ్య ప్రాంతాలకు సరఫరా చేస్తామని వెల్లడించింది. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి
ఇప్పటివరకూ 20,000 వయల్స్ మందును సిద్ధం చేసి కరోనా తీవ్రత అధికంగా ఉన్న ముఖ్యమైన నగరాలకు సరఫరా చేసినట్లు హెటిరో ప్రతినిధులు తెలిపారు. త్వరలో మరిన్ని వయల్స్ సిద్ధం చేసి దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఉన్న ముఖ్యమైన నగరాలో కోవిఫర్ అందుబాటులోకి తెస్తామన్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ