Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ ముప్పు నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థర్డ్‌వేవ్ ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. స్టాక్ ఫైల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అదెలాగంటే..
దేశంలో ఇప్పుడు కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave)ముప్పు వెంటాడుతోంది.కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విపత్కర పరిస్థితులు, ఆక్సిజన్ కొరత, బెడ్స్ లభించకపోవడం, వైద్య పరికాల లేమి, రెమ్‌డెసివిర్, బ్లాక్ ఫంగస్‌లో ఉపయోగించే ఇంజక్షన్ల కొరత వంటి పరిస్థితులతో దేశ ప్రజానీకం విలవిల్లాడారు.సరిగ్గా ఈ తరుణంలో కరోనా థర్డ్‌వేవ్ ముప్పు ఆందోళన సృష్టిస్తోంది. అందుకే మరోసారి విపత్కర పరిస్థితులు ఎదురు కాకుండా ఉండేందుకు సిద్ధమవుతోంది.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం కోవిడ్ 19 థర్డ్‌వేవ్ ఎదుర్కొనేందుకు స్టాక్ ఫైల్(National Stock File)ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా చికిత్సలో కీలకైన ప్రాణాల్ని రక్షించే అత్యవసర మందులు, ముఖ్య వైద్య పరికరాలకు సంబంధించి జాతీయ నిల్వను ఏర్పాటు చేసేందుకు కేంద్రం యోచిస్తోంది. ఫార్మా, వైద్య పరికరాల సంస్థతో చర్చలు జరుపుతోంది. ఔషధాల విభాగం కింద వైద్య పరికరాల్ని ట్రాక్ చేసేందుకు కేంద్రం నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. రానున్న విపత్తుకు సంసిద్ధంగా ఉండాలని కేంద్రం పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో క్లిష్టమైన ఔషధాల సరఫరాను వేగవంతం కానుంది. ముఖ్యమైన పరికరాలు, మందుల్ని షార్ట్ లిస్ట్ చేసి సిద్ధం చేయనుంది. జాతీయ నిల్వను సృష్టించడం ద్వారా భవిష్యత్తులో కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం(Central government) సన్నాహాలు చేస్తోంది.
Also read: Supreme Court: వన్ నేషన్..వన్ రేషన్‌పై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook