లోక్ సభలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రధాని మోడీని సభాసాక్షిగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అప్యాయంగా కౌగిలించుకున్నారు.. ఇది చూసిన సభ్యులందరూ షాక్ కు గురయ్యారు.. క్షణాల్లో తేరుకుని నవ్వులు చిందించారు..
అవిశ్వాసం తీర్మానం విషయంలో ఏ పార్టీ.. ఎవరికి మద్దతిస్తుందనే విషయం స్పష్టమైంది.. కానీ శివసేన నిర్ణయం మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. శివసేన పార్టీ ఎన్డీయే పక్షాన నిలబడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ ఆ పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే మాత్రం తన వైఖరిని ఇంకా బయటపెట్టలేదు. కండబలంతో గెలిచినంత మాత్రాన బీజేపీది విజయనిపించుకోదంటూ ఈ రోజు శివసేన సొంత పత్రిక సామ్నాలో కథనం ప్రచురితమైంది. తాజా కథనాన్ని బట్టి చూస్తుంటే శివసేన మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అవిశ్వాసంపై చర్చ జరపకుండా సభను వాయిదా వేయడంతో పార్లమెంటు ఆవరణలో తెదేపా ఎంపీలు ధర్నాకు దిగారు. అవిశ్వాసంపై చర్చ జరగకుండా కేంద్రం కుట్ర పన్నిందని టీడీపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఆందోళన చేపట్టిన సభ్యులను నియత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందిస్తూ .. ఆందోళన మధ్యే బడ్జెట్ ను ఆమోదించుకున్న కేంద్రం.. అవిశ్వాస తీర్మానంపై చర్చ ఎందుకు చేపట్టలేకపోతోందని కేంద్రాన్ని ప్రశ్నించారు. మోడీ సర్కార్ కావాలనే అవిశ్వాస తీర్మానానికి అడ్డంకులు సృష్టిస్తోందని జేసీ విమర్శించారు.
తెలుగు ఎంపీల నినాదాలతో పార్లమెంట్ ఉభయ సభలు మార్మోగాయి. ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే విభజన హామీలు, ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబడుతూ టీడీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఇదే సమయంలో రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్ సభ్యులు కూడా ఆందోళనకు దిగడంతో స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టకుండానే సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఇటు రాజ్యసభలో కూడా ఇదే గందరగోళ పరిస్థితి. సభ ప్రారంభంకాగానే తెలుగు ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేపట్టారు. ఛైర్మన్ వెంకయ్యనాయడు సభ్యులను ఎంతగా వారించిన సభ్యులు వినకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.
విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం విస్మరించిందని ఆరోపిస్తూ మోడీ సర్కార్ పై అవిశ్వాసం పెట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి జాతీయ స్థాయిలో రాజకీయపార్టీలు మద్దతిచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో పాటు వామపక్ష పార్టీలు సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఒక్క అకాలీదళ్ మినహా మిగిలిన విపక్ష పార్టీలన్నీ అవిశ్వాసానికి సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ఎన్డీయే భాగస్వామి అయిన శివసేన పార్టీ కూడా అవిశ్వాసానికి సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది.
విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు లోక్ సభను స్తంభింపచేస్తున్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే టీడీపీ ఎంపీల నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ప్లకార్లులతో నిరసన ప్రదర్శన చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళవారతావరణం నెలకొంది. దీంతో లోక్ సభ స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇటు రాజ్యసభలోనూ ఇదే తీరు కొనసాగించింది. ఏపీకి న్యాయం చేయాలని టీడీపీ ఎంపీలు ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు చేతపట్టుకొని నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను వాయిదా వేశారు.
విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ బుధవారం ఉదయం విభజన హామీల సాధన సమితి పార్లమెంట్ ముట్టడికి యత్నించింది. జంతర్ మంతర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని పార్లమెంట్ స్ట్రీట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. చలసాని సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పోలీసుల లాఠీ ఛార్జ్ తో పలువురికి గాయాలైనట్లు తెలిసింది. ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ..పరిశ్రమలకు రాయితీల విషయంలో కూడా స్పష్టమైన హామీ ఇవ్వకపోయడంతో విభజన హామీల సాధన సమితి ఆందోళన బాట పట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.