/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

లోక్ సభలో సోమవారం నాటి  సీన్ ఈ రోజు రీపీట్ అవుతోంది. కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెడుతూ టీడీపీ, వైసీపీ మంగళవారం మళ్లీ నోటీసులు జారీ చేశాయి. ఇదే సమయంలో టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులు సభలో ఆందోళనబాట పట్టాయి. రిజర్వేషన్లపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలని టీఆర్ఎస్ పట్టుబడుతుండగా.కావేరీ వాటర్ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే కోరుతోంది . దీంతో సభలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. అవిశ్వాసంపై చర్చ చేపట్టేందుకు స్పీకర్ సిద్ధమైన తరుణంలో టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఆందోళన అడ్డంకిగా మారింది. కాగా సభ్యలు ఆందోళనతో అవిశ్వాసంపై చర్చ చేపట్టడం కుదరదంటూ స్పీకర్ సభను వాయిదా వేశారు.

ఎందుకు అడ్డకుంటున్నారంటే ..?
ఏపీకి ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ , అన్నాడీఎంకే పార్టీలు ఎందుకు అడ్డుతగులుతున్నాయని ప్రశ్న ఉత్పన్నమౌతుంది కదూ.. అసలు దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇటు తెలంగాణ, అటు తమిళనాడు ప్రాంతాలు నష్టపోతాయనే భావనలో ఉన్న ఆ పార్టీలు ఇలా ప్రవర్తిసున్నాయంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ, తమిళనాడుకు చెందిన పరిశ్రమలు ఆంధ్ర ప్రాంతానికి తరలిపోయే ప్రమాదం ఉందని..అలాగే తమ రాష్ట్రాలకు రావాల్సిన కొత్త పరిశ్రమలు తరలిపోయే ప్రమాదముందనే ఆలోచనే టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీలకు హోదాను వ్యతిరేకించేలా చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అందుకే హోదాకు సంబంధించిన అవిశ్వాసాన్ని ఆ పార్టీలు ఇలా పరోక్షంగా అడ్డుతగులుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా అవిశ్వాసంపై చర్చకు సహకరించాలని టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీలకు వైసీపీ, టీడీపీలు విజ్ఞప్తి చేస్తుస్నాయి

 

Section: 
English Title: 
Parliament updates: Protests force Lok Sabha adjournment
News Source: 
Home Title: 

పార్లమెంంట్ లో అదే సీన్ రిపీట్ 

సీన్ రిపీట్ ; అవిశ్వాసంపై చర్చకు టీఆర్ఎస్, అన్నాడీఎంకే అడ్డంకి
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
సీన్ రిపీట్ ; అవిశ్వాసంపై చర్చకు టీఆర్ఎస్, అన్నాడీఎంకే అడ్డంకి