Andhra Pradesh: దేశ ప్రధాని మోదీ తల్లిలాంటి ఆంధ్ర ప్రదేశ్ ను చంపేశారని, మోడీ అంటే మోసం. మోసం చేసే వాడే మోడీ అంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ తొలి సంతకం ఉంటుందని తిరుపతి వేదికగా వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు.
విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ బుధవారం ఉదయం విభజన హామీల సాధన సమితి పార్లమెంట్ ముట్టడికి యత్నించింది. జంతర్ మంతర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని పార్లమెంట్ స్ట్రీట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. చలసాని సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పోలీసుల లాఠీ ఛార్జ్ తో పలువురికి గాయాలైనట్లు తెలిసింది. ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ..పరిశ్రమలకు రాయితీల విషయంలో కూడా స్పష్టమైన హామీ ఇవ్వకపోయడంతో విభజన హామీల సాధన సమితి ఆందోళన బాట పట్టింది.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రత్యేక హోదా అంశంపై గురువారం గుంటూరులో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ ప్రసంగిస్తూ విభజన హామీలు, ప్రత్యేక హోదా లాంటి కీలక అంశాలపై మాట్లాడుతుంటే వెంకయ్యనాయుడికి కోపం ఎందుకు వస్తుందో అర్థకావడం లేదన్నారు. వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రానికి తాకట్టుపెట్టారని ఈ సందర్భంగా శివాజీ ఆరోపించారు. ఏపీని తాకట్టు పెట్టినందుగాను కేంద్రం ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఆఫర్ చేసిందని విమర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.