న్యూఢిల్లీ: తెలుగు ఎంపీల నినాదాలతో పార్లమెంట్ ఉభయ సభలు మార్మోగాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే విభజన హామీలు, ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబడుతూ టీడీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఇదే సమయంలో రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్ సభ్యులు కూడా ఆందోళనకు దిగడంతో స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టకుండానే సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. 12 గంటల తరువాత కూడా సభ నియంత్రణలో లేకపోవడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
ఇటు రాజ్యసభలో కూడా ఇదే గందరగోళ పరిస్థితి. సభ ప్రారంభంకాగానే తెలుగు ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేపట్టారు. ఛైర్మన్ వెంకయ్యనాయడు సభ్యులను ఎంతగా వారించిన సభ్యులు వినకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.
సభ సజావుగా ఉంటే స్పీకర్ వాటికి మద్దతిచ్చే వారిని లేచి నిల్చోమని సూచించేవారు. మొత్తం లోక్‌సభ సభ్యుల్లో 10 శాతం మంది మద్దతిస్తున్నట్లు స్పీకర్ నిర్ణయించుకుంటే అవిశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకొని చర్చ షెడ్యూల్‌ను నిర్ణయించేవారు. సభ సజావుగా జరగలేదు కాబట్టి సభను నిరవధికంగా రేపటికి వాయిదా వేశారు.
19/03/2018 12: 09
అవిశ్వాసం ప్రవేశపెట్టలేదు.. లోక్‌సభ రేపటికి వాయిదా
No confidence motion not introduced, Lok Sabha adjourned till tomorrow after continuous uproar. pic.twitter.com/bdT3dbBWA8
— ANI (@ANI) March 19, 2018
19/03/2018 12: 08
అవిశ్వాసంపై చర్చించడానికి మేము సిద్ధం. చర్చల్లో పాల్గొనాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా: లోక్‌సభలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
We want a discussion on the issue of no-confidence motion and we appeal to everyone that there should be discussion : Union Minister Rajnath Singh in Lok Sabha #budgetsession
— ANI (@ANI) March 19, 2018
19/03/2018 12: 06
Uproar in Lok Sabha as TDP, YSRCP and TRS MPs come into the well of the House. #budgetsession pic.twitter.com/DhIkODNmne
— ANI (@ANI) March 19, 2018
19/03/2018 12: 05
మొత్తం తొమ్మిది పార్టీలు అవిశ్వాసానికి మద్దతు తెలిపాయి.
తెదేపా: 16
టీఎంసీ:34
కాంగ్రెస్: 44
వైఎస్ఆర్సీపీ : 9
ఏఐఎంఐఎం: 1
లెఫ్ట్: 10
ఎస్పీ: 5
19/03/2018 11:52
ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వమని మా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా: ఎంకే స్టాలిన్, డీఎంకే
Andhra Pradesh CM Chandrababu Naidu to put pressure on Central government has gone for no confidence motion for the welfare of their state. I ask this(Tamil Nadu) Government to support TDP's no confidence motion: MK Stalin,DMK in assembly (file pic) pic.twitter.com/qT9Suvt41w
— ANI (@ANI) March 19, 2018
19/03/2018 11:17
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ముస్లిం నేతలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబునాయుడిని ముస్లిం నేతలు అభినందించారు.
We thought as an NDA member,BJP will do justice to the state, but nothing happened. We waited for four years, but of no use. Even in the last budget justice was not done: Andhra Pradesh CM N Chandrababu Naidu pic.twitter.com/Gt2Mdvh1NU
— ANI (@ANI) March 19, 2018
19/03/2018 11:14
కాంగ్రెస్, టీఎంసీలు టీడీపీ అవిశ్వాసానికి మద్దతు ప్రకటించాయి.
19/03/2018 11:11
మేము ప్రభుత్వానికి, విపక్షాలకు మద్దతు ఇవ్వము. సభకు గైర్హాజరు అవుతాము: అర్వింద్ సావంత్, శివసేన ఎంపీ
We will neither support the Government nor the Opposition, we will abstain: Arvind Sawant,Shiv Sena MP on no confidence motion #budgetsession pic.twitter.com/6MV6mqj7jX
— ANI (@ANI) March 19, 2018
19/03/2018 11:08
రాజ్యసభ సమావేశం రేపటికి వాయిదా పడింది. సభలో విపక్షాల సభ్యులు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.
19/03/2018 11:02
సభలో గందరగోళం నెలకొన్న తరువాత, లోక్ సభ 12 మధ్యాహ్నం వరకు వాయిదా పడింది.
19/03/2018 10:59
టీడీపీకి ఆర్జేడీ మద్దతు ఇచ్చింది.
19/03/2018 10:56
అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం: యూనియన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్
We are ready to face no-confidence motion as we have support in the House. We are confident : Union Parliamentary Affairs Minister Ananth Kumar #budgetsession pic.twitter.com/9xnp6gDWxQ
— ANI (@ANI) March 19, 2018
19/03/2018 10:56
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఈ నిరసనలో చేరారు.
Delhi: TDP MPs protest in front of Mahatma Gandhi statue in Parliament over special category status to Andhra Pradesh. Congress MP Renuka Chowdhury also joined the protest. #budgetsession pic.twitter.com/y7T8qVrffo
— ANI (@ANI) March 19, 2018
19/03/2018 10:54
శివసేన, ఏఐఏడీఎంకేలు టీడీపీ పార్టీ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం లేదు.
19/03/2018 10:53
ఎన్సీపీ టీడీపీకి మద్దతు పలికింది.
19/03/2018 10:45
సభ సజావుగా, ఆందోళనలు లేకుండా హుందాగా జరిగితే లోక్సభ స్పీకర్ ప్రశ్నోత్తరాల తరువాత అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు.
19/03/2018 10:44
అవిశ్వాస తీర్మానంపై 3 నోటీసులను పార్లమెంట్ సెక్రటేరియట్ స్వీకరించింది. టీడీపీ నుంచి 2, వైఎస్ఆర్సిపి నుంచి 1 నోటీసులు అందాయి.
19/03/2018 10:43
స్పీకర్ అవిశ్వాస తీర్మానానికి అనుమతిస్తారా?లేదా అన్నది మేము వేచి చూస్తున్నాం. ఏపీకి సమస్యలపై టీడీపీ గళం ఎత్తడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రస్తుతానికి అవిశ్వాస తీర్మానంపై మేము ఎటూ తేల్చుకోలేదు. ఉద్ధవ్ జీ పిలుపునిస్తారు: సంజయ్ రౌత్, శివసేన
19/03/2018 10:43
అవిశ్వాస తీర్మానం కొరకు మేము వివిధ పార్టీల మద్దతును కూడగడుతున్నాము. మాకు మద్దతు ఇవ్వడానికి పార్లమెంటులో అన్ని పార్టీల బాధ్యతగా ఉన్నాయి. చర్చ జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ మద్దతును కోసం ప్రయత్నిస్తున్నాం.. ప్రభుత్వం పడిపోవడానికి కాదు.. ఏపీ ప్రయోజనాల కోసం : రాంమోహన్ నాయుడు, తెలుగుదేశం ఎంపీ
19/03/2018 10:41
తెలుగుదేశం పార్టీ ఎంపీలకు విప్ జారీచేసింది. పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు పార్లమెంటుకు హాజరవ్వాలని ఆదేశించింది.