విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ బుధవారం ఉదయం విభజన హామీల సాధన సమితి పార్లమెంట్ ముట్టడికి యత్నించింది. జంతర్ మంతర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని పార్లమెంట్ స్ట్రీట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. చలసాని సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పోలీసుల లాఠీ ఛార్జ్ తో పలువురికి గాయాలైనట్లు తెలిసింది. ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ..పరిశ్రమలకు రాయితీల విషయంలో కూడా స్పష్టమైన హామీ ఇవ్వకపోయడంతో విభజన హామీల సాధన సమితి ఆందోళన బాట పట్టింది.