విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు లోక్ సభను స్తంభింపచేస్తున్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే టీడీపీ ఎంపీల నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ప్లకార్లులతో నిరసన ప్రదర్శన చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళవారతావరణం నెలకొంది. దీంతో లోక్ సభ స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇటు రాజ్యసభలోనూ ఇదే తీరు కొనసాగించింది. ఏపీకి న్యాయం చేయాలని టీడీపీ ఎంపీలు ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు చేతపట్టుకొని నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను వాయిదా వేశారు.