మంత్రులు దయచేసి అలా అడుక్కోవద్దు: వెంకయ్య నాయడు

పార్లమెంట్‌లో టేబుల్‌పై పత్రాలు ప్రవేశపెట్టే సందర్భంలో 'ఐ బెగ్ యు' అని సంభోదించే ఆనవాయితీకి స్వస్తి పలకాలని సూచిస్తూ ఇకపై మంత్రులు దయచేసి అలా అడుక్కోవద్దు అని అన్నారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.

Last Updated : Dec 30, 2017, 12:32 PM IST
మంత్రులు దయచేసి అలా అడుక్కోవద్దు: వెంకయ్య నాయడు

పార్లమెంట్‌లో టేబుల్‌పై పత్రాలు ప్రవేశపెట్టే సందర్భంలో 'ఐ బెగ్ యు' అని సంభోదించే ఆనవాయితీకి స్వస్తి పలకాలని సూచిస్తూ ఇకపై మంత్రులు దయచేసి అలా అడుక్కోవద్దు అని అన్నారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. తరచుగా వివిధ పత్రాలని టేబుల్‌పై ప్రవేశపెట్టే సందర్భాల్లో మంత్రులు ఆనవాయితీ ప్రకారమే చెప్పే 'ఐ బెగ్ యు' అని ప్రస్తావించడం మానేసి 'ఐ రైస్ టు ప్రజెంట్ పేపర్స్' అని చెప్పాల్సిందిగా చైర్మన్ వెంకయ్య నాయుడు సలహా ఇచ్చారు. పార్లమెంట్‌లో సమావేశాలు ప్రారంభమైన తర్వాత డిసెంబర్ 15వ తేదీనే వెంకయ్య నాయుడు దీవిపై మంత్రులకి ఓ సూచన చేశారు. అప్పటి నుంచి మంత్రులు చైర్మన్ చెప్పినట్టుగానే 'ఐ రైస్ టు ప్రజెంట్ పేపర్స్' అని చెబుతూ వస్తున్నారు.

అయితే, శుక్రవారం జరిగిన సమావేశాల్లో మంత్రి పీపీ చౌదరి పలు పత్రాలని ప్రవేశపెట్టే క్రమంలో మళ్లీ పాత పాద్ధతిలోనే ఐ బెగ్ యు అని చెప్పడంతో వెంటనే చైర్మన్ వెంకయ్య నాయుడు మంత్రిగారి ప్రసంగాన్ని అడ్డుకుంటూ... ''దయచేసి ఐ బెగ్ యు'' అని అలా అడుక్కోకండని సున్నితంగానే సూచించారు. ''తాను గతంలో దీనిపై సలహా ఇచ్చిన సమయంలో మంత్రి పీపీ చౌదరి గారు సభలో లేరు అనుకుంటాను కాబోలు. అందుకే ఆయన అలా ఐ బెగ్ యు'' అని చెప్పుకొచ్చారని అన్నారు. చైర్మన్ చేసిన ఈ సూచనపై స్పందించిన మంత్రి పీపీ చౌదరి తన తప్పిదాన్ని సరిదిద్దుకోవడమే కాకుండా ఆ తర్వాత చేసిన ప్రసంగంలో మళ్లీ ఎక్కడా ఆ తప్పు దొర్లకుండా చూసుకోవడం విశేషం. 

Trending News