లోక్ సభలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రధాని మోడీని సభాసాక్షిగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అప్యాయంగా కౌగిలించుకున్నారు.. ఇది చూసిన సభ్యులందరూ షాక్ కు గురయ్యారు.. క్షణాల్లో తేరుకుని నవ్వులు చిందించారు..
వివరాల్లోకి వెళ్లినట్లుయి అవిశ్వాస తీర్మానం సందర్భంలో ఉద్వేగంగా ప్రసంగించిన రాహుల్ గాంధీ ..మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ 'మీ మనసుల్లో తనపై ద్వేషం ఉంటుంది... కానీ నా మనసులో మాత్రం ఏమాత్రం ద్వేషం ఉండదు' అని పేర్కొన్నారు. నా మీద కోపంతో నన్ను పప్పు అని పిలవాలని.. ఇంకా ఎన్నో మాటలు అనాలని మోడీజీకి ఉంటుందని రాహుల్ వ్యాఖ్యానించారు.
ప్రసంగం అనంతరం రాహుల్ గాంధీ.. మోడీ దగ్గరకు వెళ్లి మరి ఆయన్ను అప్యాయంగా కౌగిలించుకొని తన మనసులో ఎలాంటి ద్వేషం ఉండదని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ ఆకస్మిక చర్యతో ఒక క్షణం మోదీ అవాక్కయ్యారు...వెంటనే తేరుకొని రాహుల్ కు భుజం తట్టి అభినందించారు. అక్కడి నుంచి తన స్థానానికి తిరిగి వెళుతున్న రాహుల్‌ను మరోసారి పిలిచి మోడీ కరచాలనం చేశారు. కాగా ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది