Omicron threat: దేశంలో 27 జిల్లాల్లో కోవిడ్ తీవ్రత.. అప్రమత్తత అవసరం అంటోన్న కేంద్రం

Centre monitoring 27 districts with spike in Covid positivity rate : దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలు‌‌ - కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతోందని కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చిరించింది. కేరళ, సిక్కిం, మిజోరంలలోని ఎనిమిది జిల్లాలలో కోవిడ్ పాజిటివిటీ రేటు పది శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2021, 03:10 PM IST
  • దేశాన్ని హడలెత్తిస్తోన్న ఒమిక్రాన్
  • భారత్‌లో క్రమంగా పెరుగుతున్న కేసులు
  • 27 జిల్లాల్లో పెరిగిన కోవిడ్ పాజిటివిటీ రేటు
  • రాష్ట్రాలు అప్రమత్తం చేసిన కేంద్రం
  • ప్రస్తుతం మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 33
Omicron threat: దేశంలో 27 జిల్లాల్లో కోవిడ్ తీవ్రత.. అప్రమత్తత అవసరం అంటోన్న కేంద్రం

Omicron threat: Maintain strict vigil, monitor 27 districts closely, Centre tells states : దేశంలో గత కొన్ని రోజులుగా కోవిడ్ అదుపులోనే ఉంది కానీ.. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ హడలెత్తిస్తోంది. ప్రపంచం మొత్తాన్ని భయపెడ్తుతోన్న ఒమిక్రాన్ (Omicron) కేసులు ఇప్పుడు మనదేశంలో క్రమంగా పెరుగుతున్నాయి.

కోవిడ్ కొత్త వేరియంట్‌ (New variant‌) కేసులు రోజురోజుకు పెరుగుతుండంతో కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. కోవిడ్ నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని కేంద్రం (Centre) సూచించింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి సారించాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖలు పంపింది. 

దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలు‌‌ - కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో (27 districts) కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతోందని కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చిరించింది. కేరళ, సిక్కిం, మిజోరంలలోని ఎనిమిది జిల్లాలలో కోవిడ్ పాజిటివిటీ రేటు పది శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. మిగతా ఏడు రాష్ట్రాలు ‌‌- కేంద్రపాలిత ప్రాంతాల్లోని పంతొమ్మిది జిల్లాలలో కోవిడ్ పాజిటివిటీ రేటు ఐదు నుంచి పది శాతంగా నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

Also Read : Viral Video: స్కూటీని ఢీకొట్టిన లారీ-ఇంజనీరింగ్ విద్యార్థిని అక్కడికక్కడే మృతి

ఏ జిల్లాలోనైనా కరోనా కేసులు అలాగే పాజిటివిటీ రేటు (Covid positivity rate) పెరుగుతున్నట్లు అయితే వెంటనే స్థానిక యంత్రాంగం చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కోవిడ్ టెస్ట్‌లను వేగవంతం చేయాలని, అలాగే వ్యాక్సినేషన్‌ (Vaccination‌) పెంచాలని పేర్కొంది. అలాగే ఆ ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్స్‌గా ప్రకటించి కర్ఫ్యూ విధించాలని సూచించింది. జనసమూహాలు ఏర్పడకుండా చూడాలని పేర్కొంది. అలాగే వివాహాలు, అంత్యక్రియల్లో పాల్గొనే వారి విషయంలో పరిమితులు విధించాలని కేంద్రం.. రాష్ట్రాలు‌‌, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. 

తాజాగా ఢిల్లీలో ఒమిక్రాన్ రెండో కేసు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో ప్రస్తుతం మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 33కి చేరింది. ఢిల్లీలో కొత్తగా ఒమిక్రాన్ (Omicron) బారినపడ్డ ఈ వ్యక్తి కరోనా రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకున్నారు. అయినా కూడా కొత్త కోవిడ్ వేరియంట్ (New Covid variant) బారినపడ్డారు. కాగా నిన్న ఒక్కరోజే దేశంలో 9 మంది ఒమిక్రాన్‌ బారినపడ్డారు. ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 17 ఒమిక్రాన్ (Omicron) కేసులు నమోదయ్యాయి. దీంతో ముంబైలో (Mumbai) రెండు రోజుల పాటు 144 సెక్షన్‌ విధించిన విషయం తెలిసిందే.

Also Read : Omicron: ఢిల్లీలో రెండో ఒమిక్రాన్‌ కేసు.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఎన్నంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News