Cricketers Test Positive For Omicron : ఒమిక్రాన్ బారినపడ్డ ఇద్దరు బంగ్లాదేశ్‌ క్రికెటర్లు

Two Bangladesh Women’s Cricketers Test Positive For Omicron : బంగ్లాదేశ్‌ మహిళా క్రికెట్‌ జట్టులో ఇద్దరు క్రికెటర్స్ ఒమిక్రాన్ బారినపడ్డారు. ఇటీవల జింబాబ్వే పర్యటన నుంచి తిరిగొచ్చిన వారిద్దరూ ఒమిక్రాన్‌ బారిన పడ్డారు. ఈ మేరకు బంగ్లాదేశ్ వైద్యశాఖ మంత్రి జహీద్‌ మలాకీ ప్రకటన చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2021, 06:11 PM IST
  • తాజాగా బంగ్లాదేశ్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు
  • ఒమిక్రాన్ బారినపడ్డ బంగ్లాదేశ్‌ మహిళా క్రికెట్‌ జట్టులో ఇద్దరు క్రికెటర్స్
  • ఇటీవల జింబాబ్వే పర్యటన నుంచి తిరిగొచ్చిన ఇద్దరు మహిళా క్రికెటర్స్
  • బంగ్లాదేశ్‌లో నమోదైన తొలి ఒమిక్రాన్ కేసులు ఇవే
 Cricketers Test Positive For Omicron : ఒమిక్రాన్ బారినపడ్డ ఇద్దరు బంగ్లాదేశ్‌ క్రికెటర్లు

Two Bangladesh Cricketers Test Positive for Omicron Variant: గత నెలలో సౌత్‌ఆఫ్రికా, జింబాబ్వేలలో కోవిడ్‌​ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి రావడంతో ఇప్పడు ప్రపంచం మొత్తం హడలెత్తుతోంది. ఒమిక్రాన్ కేసులు తమ దేశాల్లో వెలుగు చూడకూడదని కోరుకుంటున్నాయి. అయితే తాజాగా బంగ్లాదేశ్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

బంగ్లాదేశ్‌ మహిళా క్రికెట్‌ జట్టులో ఇద్దరు క్రికెటర్స్ ఒమిక్రాన్ (Two women cricketers of Bangladesh tested positive) బారినపడ్డారు. ఇటీవల జింబాబ్వే (Zimbabwe) పర్యటన నుంచి తిరిగొచ్చిన ఇద్దరు మహిళా క్రికెటర్స్ ఒమిక్రాన్‌ బారినపడ్డట్లు బంగ్లాదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జహీద్‌ మలాకీ (Health and Family Welfare Minister Zahid Maleque) ప్రకటన చేశారు. కోవిడ్‌ బారిన పడిన ఆ ఇద్దరు క్రికెటర్స్‌లో స్వల్ప జ్వరం తప్ప ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొన్నారు. వారిద్దరూ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పారు.

Also Read : Shocking video: వామ్మో.. రెండు తలల పాము.. రెండు ఎలుకలను ఒకేసారి ఎలా మింగేస్తుందో చూడండి 

అయితే డిసెంబరు 6న బంగ్లాదేశ్‌కు చెందిన ఈ ఇద్దరు మహిళా క్రికెటర్లకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ డిసీజ్ కంట్రోల్ అండ్ రీసెర్చ్ (ఐఇడిసిఆర్) (Institute of Epidemiology Disease Control and Research) ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ ఎఎస్ఎమ్ అలంగీర్ (Principal Scientific Officer Dr ASM Alamgir) పేర్కొన్నారు. తాజాగా వారిద్దరూ ఒమిక్రాన్ వేరియంట్ బారినపడినట్లు నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. అలాగే వారిద్దరితో కాంటాక్ట్‌లో ఉన్న వారందరికీ కోవిడ్ (Covid) టెస్ట్‌లు చేశామని తెలిపారు. అయితే అందరికీ నెగెటివ్ వచ్చిందన్నారు. ఇక బంగ్లాదేశ్‌లో నమోదైన తొలి ఒమిక్రాన్ (Omicron) కేసులు ఇవే.

Also Read : Video: సారా అలీ ఖాన్ లేటెస్ట్ సాంగ్‌కి ఎయిర్ హోస్టెస్ అదిరిపోయే స్టెప్పులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News