Delhi Omicron Threat: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. కొత్తగా మరో నాలుగు కేసులు నమోదవడంతో ఆందోళన అధికమైంది.
దక్ణిణాఫ్రికా నుంచి వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నెమ్మదిగా ప్రపంచమంతా విస్తరిస్తూ భయం గొలుపుతోంది. యూకేలో పరిస్థితి దారుణంగా తయారైంది. వచ్చే ఏడాది నాటికి పరిస్థితి తీవ్రంగా మారవచ్చనే హెచ్చరికలు వస్తున్నాయి. ఇటు ఇండియాలో కూడా ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా మరో నాలుగు కేసులు బయటపడినట్టు స్వయంగా ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyender Jain)వెల్లడించారు. కొత్తగా నమోదైన నాలుగు కేసులతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 6కు చేరింది.
కొత్తగా బయటపడిన నాలుగు కేసులకు సంబంధించిన వ్యక్తులు విదేశాల్నించి వచ్చినవారే కావడం గమనార్హం. ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో మొత్తం 35 మంది కోవిడ్ పాజిటివ్ రోగులు చేరారని..వీరిలో ముగ్గురికి ఒమిక్రాన్ సోకిందనే అనుమానాలున్నాయన్నారు. నిన్న ఢిల్లీలో ఒమిక్రాన్ సోకిన తొలివ్యక్తి కోలుకుని ఇదే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. డిసెంబర్ 2న కతార్ ఎయిర్‌వేస్ ద్వారా టాంజేనియా నుంచి దోహాకు..అక్కడి నుంచి ఢిల్లీకు చేరాడు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్‌లో నివసిస్తున్న ఈ రాంచీకు చెందిన ఈ వ్యక్తికి స్వల్ప లక్షణాలు బయటపడ్డాయి. ఢిల్లీలో కొత్త ఒమిక్రాన్(Omicron Cases)కేసులకు జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే దేశాల్లో తిరిగిన 35 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఇతనికి చికిత్స అందిస్తున్నారు.
Also read: Banks Strike: దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు ఎస్బీఐ దూరమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి