Omicron case in Kerala: తిరువనంతపురం: కేరళలో ఆదివారం తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి కొచ్చికి వచ్చిన వ్యక్తికి ఈ కొత్త రకం వేరియంట్ సోకినట్టు కేరళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ తెలిపారు. ఒమిక్రాన్ సోకిన పేషెంట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, రాష్ట్రంలో ఒమిక్రాన్ నిరోధం దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నందున ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38 కి చేరింది.
ఇదిలావుంటే, ఇవాళే నాగపూర్‌లోనూ తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. నాగపూర్ నగర మునిసిపల్ కమిషనర్ బి రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు గుర్తించామని అన్నారు. ఇవాళే ఛండీగడ్, ఆంధ్రప్రదేశ్ (Omicron variant in AP), కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఒక్కో కేసును గుర్తించారు.
Also read : Shocking video: వామ్మో.. రెండు తలల పాము.. రెండు ఎలుకలను ఒకేసారి ఎలా మింగేస్తుందో చూడండి
దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో (Omicron cases) మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 17 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా రాజస్థాన్ 9 ఒమైక్రాన్ కేసులతో ఆ తర్వాతి స్థానంలో ఉంది.
ఇప్పటివరకు గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో వేర్వేరుగా మూడేసి ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో (Omicron variant cases in India) ఇప్పటివరకు రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.
Also read : Crazy Offer: రూ.20,990 ధర గల Oppo Mass 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 2,000కే.. త్వరపడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook