China omicron: ప్రపంచవ్యాప్తంగా 'ఒమిక్రాన్' కల్లోలం...చైనాలో తొలి కేసు నమోదు..

Omicron: కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో తొలి ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. అంతేకాకుండా తాజాగా మరో ఒమిక్రాన్ కేసు కూడా నమోదైంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 03:01 PM IST
  • చాప కింద నీరులా విస్తరిస్తోన్న ఒమిక్రాన్
  • చైనాలో తొలి కేసు నమోదు
  • భయాందోళనలో ప్రజలు
China omicron: ప్రపంచవ్యాప్తంగా 'ఒమిక్రాన్' కల్లోలం...చైనాలో తొలి కేసు నమోదు..

China Omicron Case: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) కల్లోలం సృష్టిస్తోంది. ఈ వేరియంట్ శరవేగంగా అన్ని దేశాలకు చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా కొవిడ్‌-19 మహమ్మారి పుట్టిన చైనా(China)లోనూ తొలి ఒమిక్రాన్ కేసు వెలుగుచూసింది.

టియాంజిన్‌ నగరంలో ఒమిక్రాన్‌ కేసు(First Omicron Case in China) నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. తాజాగా దక్షిణ చైనా నగరమైన గ్వాంగ్‌జౌ(Guangzhou)లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. నవంబరులో విదేశాల నుంచి వచ్చి 67ఏళ్ల వ్యక్తిలో ఈ వేరియంట్ బయటపడింది. ఇప్పటికే డెల్టా ప్రభావంతో వణికిపోతున్న చైనాలో ఇప్పుడు ఒమిక్రాన్‌ వెలుగు చూడడం ఆందోళనకు గురిచేస్తోంది. 

Also Read: World Omicron Alert: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్

ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రమాదకర వేరియంట్‌ విస్తృత వేగంతో వ్యాపిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ వేరియంట్‌ దాదాపు 60 దేశాలకు పైగా వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది. ఇదే సమయంలో బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌(Omicron Variant Death)తో తొలి మరణం నమోదైంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News