Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో మరో గంటలో వడగళ్ల వానతో కూడిన భారీ వర్షం కురిసే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించినట్టుగానే నగరంలో భారీ వర్షం కురుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు గతంలో ఎప్పుడు లేని విధంగా మండి పోతున్నాయి. ఉదయం 10 దాటిన తరువాత బయటకి రావటానికి భయపడే పరిస్థితి. దీని కారణంగా మెట్రో స్టేషన్ లలో రద్దీ పెరిగిపోయింది.
BJP Satya Kumar Allegations on Idols Missing: బిజెపి జాతీయ నేత సత్య కుమార్ యాదవ్ తెలంగాణ ప్రభుత్వం మీద సంచలన ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశారు, విగ్రహాలు కిడ్నాప్ అయ్యాయని ఆయన అన్నారు.
Fast track court verdict in Banjara Hills DAV Public School Girl Sexual Harassments Case : రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటనలో నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆరు నెలల పాటు ఈ కేసు దర్యాప్తు కొనసాగింది. విచారణ తర్వాత శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది.
Hyderabad: హైదరాబాద్ వాసులపై వరుణుడు చల్లని చూపు చూశాడు. ఎండ తీవ్రతతో బాధపడుతున్న భాగ్యనగర వాసులను ఇవాళ పలకరించాడు. నగరంలో చాలా చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది.
Prakash Ambedkar About KCR: దేశానికి రక్షణపరంగా రెండో రాజధాని అవసరం ఉంది. ఆ రెండో రాజధాని హైదరాబాద్ అయితేనే బాగుంటుంది అని ప్రకాశ్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ రెండో రాజధాని అవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అది నెరవేరాలని కోరుకుంటున్నా అని ప్రకాశ్ అంబేద్కర్ పేర్కొన్నారు.
125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని అన్ని హంగులతో హైదరాబాద్‌లోని ట్యాక్‌బండ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేడు సీఎం కేసీఆర్ ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహంపై స్పెషల్ స్టోరీ..
Heavy Rains in Hyderabad: హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలపై వరుణుడు కరుణించాడు. ఇవాళ తెల్లవారుజామున నుంచి వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.
Hyderabad: కరెంటు షాక్ తగిలి ముగ్గురు యువకులు మృత్యువాత పడిన ఘటన హైదరాబాద్ నగరంలోని షేక్‌పేటలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు కావడం విశేషం.
హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్ పక్కన ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు చకచక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
Secunderabad Railway Station Redevelopment Design Photos : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ డిజైన్ ఫోటోలు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ఇప్పుడున్న రైల్వే స్టేషన్ స్థానంలోనే ఇలాంటి రైల్వే స్టేషన్ రాబోతోందా అని నోర్లు వెళ్లబెట్టాల్సిందే. అవును, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ని వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్రం నడుం బిగించింది.
TSPSC Paper Leak Case: పేపర్ లీకేజీ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ఇప్పటికే నాలుగు పరీక్షలను రద్దు చేసి.. రెండింటిని వాయిదా వేసింది. తాజాగా మరో పరీక్షను కూడా వాయిదా వేసినట్లు ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.