Janmashtami 2024: జన్మాష్టమి సందర్బంగా హైదరాబాద్ లో దర్శించుకునే శ్రీకృష్ణుడి దేవాలయాలివే

Janmashtami 2024: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ దేవాలయాల్లో వెళ్లి చిన్ని కృష్ణుని పూజించడం అనేది ఆనవాయితీ.  ఈ సందర్భంగా మీరు చిన్ని కృష్ణుడిని కొలవాలనుకుంటున్నారా అయితే హైదరాబాదులో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయాల గురించి తెలుసుకుందాం.  జన్మాష్టమి రోజున ఇక్కడ అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు. 
 
1 /8

2 /8

అబిడ్స్, ఇస్కాన్ టెంపుల్ :  నగరంలోని అబిడ్స్ సెంటర్లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ లో  శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.  నగరం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు.   

3 /8

కాచిగూడ, శ్యాం మందిర్:  కాచిగూడ లోని శ్యామ్ మందిర్ నగరంలోని సుప్రసిద్ధ శ్రీకృష్ణ దేవాలయం.  ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తారు.  

4 /8

బాగ్ అంబర్ పేట్, గురువాయుర్ శ్రీ కృష్ణ దేవాలయం:  బాగ్ అంబర్ పేట్ లో ఉన్న గురువాయుర్ శ్రీకృష్ణ దేవాలయంలో  శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు  ఘనంగా నిర్వహిస్తారు.  నగరం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.  

5 /8

నాగోల్, శ్రీకృష్ణ దేవాలయం :  నాగోల్ నుంచి ఎల్బీనగర్ కు వెళ్లే దారిలో,  రామకృష్ణాపురం  వద్ద శ్రీకృష్ణ దేవాలయం  అతిపెద్ద ప్రాంగణంలో నిర్మించారు.  ఇక్కడ జరిగే శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు  చూసేందుకు నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు.   

6 /8

బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 11, హరే కృష్ణ గోల్డెన్  టెంపుల్ :  బంజారాహిల్స్ లో ఉన్న హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ లో  శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

7 /8

దిల్ సుఖ్ నగర్ లో ఉన్నటువంటి కృష్ణానంద మఠంలో  శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.   

8 /8

 బోడుప్పల్ ప్రాంతంలో కొలువైన శ్రీకృష్ణ దేవాలయంలో జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.