Hydra Ranganath: సంచలనాలకు కేరాఫ్ గా హైడ్రా రంగనాథ్.. ఆయన బ్యాక్ గ్రౌండ్, ఛేదించిన కేసులేంటో తెలుసా..?

AV Ranganath Story: తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసిన ప్రస్తుతం హైడ్రా రంగనాథ్ పేరు మార్మోగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆయన హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.
 

1 /7

ఏవీ రంగనాథ్ ప్రస్తుతం నాగార్జున ఎన్ క్లేవ్ కూల్చివేతతో ఆయన పేరు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంచలన ఐపీఎస్ అధికారి ఎవరు అని నెటిజన్లు తెగ ఆసక్తిగా ఆయన గురించి తెలుసుకునేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు చేపట్టిన వారికి నిద్రలేకుండా చేస్తున్న ఈ ఐపీఎస్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.  

2 /7

ఏవీ రంగనాథ్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పోలీస్ ఆఫీసర్. ఎన్నో పరిష్కారం కానీ కేసులను చాలా సులువుగా.. తక్కువ కాలంలో ఛేదించారు. ఉమ్మడి ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసినఈ ఐపీఎస్ అధికారి పనిచేశారు. ఆవుల వెంకట రంగనాథ్‌ 1996లో గ్రూప్-1లో టాప్ ర్యాంక్‌ సాధించి పోలీస్ బాస్ కావాలనే టార్గెట్ పెట్టుకుని డీఎస్పీ ఆప్షన్‌ ఎంచుకున్నారు.  

3 /7

మొదటి పోస్టింగ్ లోనే 2000 సంవత్సరంలో గ్రేహౌండ్స్‌ కమాండర్‌ గా విధులు నిర్వర్తించారు. కొత్తగూడెం, మార్కపురంలో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టి తనదైన ముద్ర వేశారు. గ్రేహౌండ్స్‌ ఆపరేషన్స్‌ పునరుద్ధరించడంలో కీలకంగా వ్యవహరించిన రంగనాథ్‌ కు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు తో సత్కరించింది.

4 /7

ఖమ్మం ఎస్పీగా పనిచేసి 2014 అక్కడినుంచి నల్లగొండకు బదిలీ అయిన ఆయన.. ఇప్పడు హైడ్రా చీఫ్‌గా తన మార్క్ చూపిస్తున్నారు. హైదరాబాద్ చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి చుక్కలు చూపిస్తున్నారు.   విజయవాడలో పనిచేస్తున్న టైమ్ లో ఆయేషా హత్య కేసును చేధించి సంచలనం సృష్టించారు. 

5 /7

ఖమ్మం ఎస్సీగా ఉన్నప్పుడు భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపారు. ఆ తర్వాత ఖమ్మం నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్‌ కమిషనర్‌ గా బాధ్యతలు స్వీకరించిన రంగనాథ్.. హైదరాబాద్ లో అనేక మార్పులు తీసుకొచ్చారు. పలు ప్రాంతాల్లో సిగ్నల్స్ తీసేసి యూ టర్న్ లు ఏర్పాటు చేయించారు. మలక్ పేట్ రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు విస్తరణ చేపట్టారు. 

6 /7

వరంగల్ పోలీస్ కమీషనర్ రేట్ పరిధిలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపిన రంగనాథ్ కు పాలాభిషేకాలు చేశారు. నర్సంపేటలోనూ వైఎస్ షర్మిల గొడవ తర్వాత కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. నల్గొండ పదవతరగతి పేపర్ లీకేజీలో బండి సంజయ్ అరెస్ట్ తో సంచలనం క్రియేట్ చేశారు. 

7 /7

గంజాయి స్మగ్లర్లకు కంటిమీద కునుకు లేకుండా చేసిన రంగనాథ్.. ఏవోబీలోనూ కీలకంగా వ్యవహరించారు. అయేషా, అమృత ప్రణయ్‌ కేసులోనూ రంగనాథ్ తన ప్రత్యేకత చాటుకున్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో ఎలక్షన్ కమీషన్ రంగనాథ్ ను హైదరాబాద్ బదీలి చేయగా.. రేవంత్ సర్కార్ కొత్తగా క్రియేట్ చేసి హైడ్రాకు రంగనాథ్ ను చీఫ్ గా నియమించింది.