Harish Rao Review: గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గంట గంటకు ఉగ్రరూపం దాల్చుతోంది. ఈక్రమంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
గోదావరి మహోగ్రరూపం కొనసాగుతోంది. గోదావరి చరిత్రలోనే జూలై నెలలోనే రికార్డ్ స్థాయిలో అత్యంత ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. శనివారం ఉదయం 11 గంటల సమయానికి ధవళేశ్వరం బ్యారేజీకి 24.20 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు. 1986 తర్వాత ధవళేశ్వరం దగ్గర 24 లక్షలకు పైగా ఇన్ ఫ్లో నమోదు కావడం ఇదే. జూలైలో ఇంతటి వరదలు ఎప్పుడు రాలేదు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.ధవళేశ్వరం బ్యారేజీపై రాకపోకలు నిలిపివేశారు.
తెలంగాణతో పాటు ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ లో భారీ వర్షాలు తగ్గినా గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. మేడిగట్ట నుంచి భద్రాచలం మీదుగా పోలవరం, ధవళేశ్వరం వరకు గోదారమ్మ మహోగ్రంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం 71 అడుగులు దాటడంతో భద్రాచలం నీట మునిగింది. రామాలయం చుట్టూ నీళ్లే ఉన్నాయి. పట్టణంలోని దాదాపు 10 కాలనీలు పూర్తిగా జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. కొన్ని భవంతుల మూడో అంతస్తు వరకు వరద నీరు చేరింది. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం వంతెనపై శనివారం సాయంత్రం వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి
Godavari Floods: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించి వరత బాధితులకు సాయం ప్రకటించారు. ఏపీ సీఎం జగన్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటికి రాకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి
Dowleswaram Barrage: గోదావరి మహోగ్రరూపం కొనసాగుతోంది. గోదావరి చరిత్రలోనే జూలై నెలలోనే రికార్డ్ స్థాయిలో అత్యంత ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. శనివరం మధ్యాహ్నం నుంచి భద్రచాలం దగ్గర గోదావరి తీవ్రత కాస్త తగ్గినా.. ధవళేశ్వరంలో మాత్రం మరో 24 గంటలు పాటు కొనసాగనుంది
Godavari Floods: వర్షాకాల సీజన్ లో 16వ తేదీ వస్తే గోదావరి తీర గ్రామాల వాసులు వణికిపోతున్నారు. తమకు ఏ గండం ముంచుకొస్తుందోనన్న భయంతో హడలిపోతున్నారుయ ఎందుకంటే 16వ తేదీనే గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం గోదావరికి రికార్డ్ స్థాయిలో వరద వచ్చింది. శనివారం జూలై16వ తేదీని గోదావరిలో నీటిమట్టం 71.8 అడుగులకు చేరింది.
Badrachalam Flood: తెలంగాణతో పాటు ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ లో భారీ వర్షాలు తగ్గినా గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. మేడిగడ్డ నుంచి భద్రాచలం మీదుగా పోలవరం, ధవళేశ్వరం వరకు గోదారమ్మ మహోగ్రంగా ప్రవహిస్తోంది. శనివారం ఉదయం ఆరు గంటలకు వరకు భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 71.3 అడుగులకు చేరింది.
Godavari Danzer Level: గోదారమ్మ మహోగ్రరూపం దాల్చింది. చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా జూలైలోనే కనివీని ఎరుగని వరదలతో పోటెత్తుత్తోంది. గురువారం కాస్త వర్షాలు తగ్గినా గోదావరి మాత్రం మరింత ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం, పోలవరం, ధవళేశ్వరం దగ్గర గంటగంటకు నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటితే వందలాది లంక గ్రామాలను ఖాళీ చేశారు. వరద పరిస్థితిని బట్టి గ్రామాలను ఖాళీ చేస్తూ పోతున్నారు అధికారులు.
Godavari Floods:గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది. కాళేశ్వరం నుంచి 28 లక్షలకు పైగా వరద వస్తుండటంతో భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. అంతకు ముంది ప్రమాదకర స్థాయిలో గోదారమ్మ ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 68.3 అడుగులకు చేరింది. మధ్యాహ్నం 12 గంటలకు 69 అడుగులకు చేరింది. సాయంత్రానికి భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Badrachalam Flood: గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది. కాళేశ్వరం నుంచి 28 లక్షలకు పైగా వరద వస్తుండటంతో భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చిరక జారీ చేయగా.. అంతకు ముంది ప్రమాదకర స్థాయిలో గోదారమ్మ ప్రవహిస్తోంది.
Telangaan Floods:ఇంద్రావతి నది ప్రవాహంతో మేడగడ్డ దగ్గర గోదావరి నీళ్లు రివర్స్ అవుతున్నాయి కిందకు వెళ్ళలేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలను ముంచేస్తోంది వరద. లక్ష్మీ బ్యారేజీ కంట్రోల్ రూమ్ బిల్డింగ్ ను నలువైపులా నుంచి వరద వెళ్తోంది. కంట్రోల్ రూమ్ లో వున్న 90మంది పోలీసులు,10మంది ఇంజనీర్లు,15మంది సిబ్బంది వరద మధ్యలో చిక్కుకుపోయారు
Godavari Floods: గోదారమ్మ మహోగ్రరూపం దాల్చింది. చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా జూలైలోనే కనివీని ఎరుగని వరదలతో పోటెత్తుత్తోంది. గురువారం కాస్త వర్షాలు తగ్గినా గోదావరి మాత్రం మరింత ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం, పోలవరం, ధవళేశ్వరం దగ్గక గంటగంటకు నీటిమట్టం పెరుగుతోంది.
Godavari Floods: గోదావరి మహోగ్రరూపం దాలుస్తోంది. భారీ ఎత్తున వరద నీటితో విధ్వంసం సృష్టిస్తోంది. కోనసీమలో 51 గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. భద్రాచలంలో ప్రమాదకరస్థాయికి చేరుకోవడం ఆందోళన కల్గిస్తోంది.
Floods: భారీ వర్షాలకు ములుగు జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరిలో వరద నీటి ప్రవాహం పెరగడంతో..దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Badrachalam Flood: గోదావరి ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తుండటంతో భద్రాచలం వెళ్లే అన్ని దారులను గోదావరి ముంచెత్తింది. రాములోరి ఆలయాన్ని వరద చుట్టుముట్టింది. అన్నదాన సత్రం జలమలమైంది.భద్రాచలంలో ఇప్పటికే లోతట్టు కాలనీలు జలమలమయ్యాయి. వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరిలంతారు. కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, శాంతినగర్ పిస్తా కాంప్లెంక్స్ ఏరియా, సుభాష్ నగర్ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వరదనీటిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మునిగిపోవడంతో ముందుజాగ్రత్తగా అధికారులు కరెంట్ సరఫరా ఆపేశారు.
Godavari Floods: గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరికలో ఉన్న గోదావరి నదికి..రేపు చివరి మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్ని అప్రమత్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.