Godavari Floods: గోదారమ్మ మహోగ్రరూపం దాల్చింది. చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా జూలైలోనే కనివీని ఎరుగని వరదలతో పోటెత్తుత్తోంది. గురువారం కాస్త వర్షాలు తగ్గినా గోదావరి మాత్రం మరింత ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం, పోలవరం, ధవళేశ్వరం దగ్గక గంటగంటకు నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటితే వందలాది లంక గ్రామాలను ఖాళీ చేశారు. వరద పరిస్థితిని బట్టి గ్రామాలను ఖాళీ చేస్తూ పోతున్నారు అధికారులు. తెలంగాణలోని మంచిర్యాల ,భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు ఏపీలోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో హై అలెర్ట్ ప్రకటించారు. ఉన్నతాధికారులు తీర ప్రాంతాల్లోనే ఉండి సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు
శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 66.6 అడుగులకు చేరింది. భద్రాచలంలో గోదావరి వరద 20 లక్షల క్యూసెక్కులకు పైగానే ఉంది. గంటగంటకు గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో శుక్రవారం సాయంత్రానికి నీటిమట్టం 70 అడుగులకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద నీటితో ఇప్పటికే భద్రాచలంలోని దాదాపు సగం పట్టణం నీట మునిగింది. రాములోరి ఆలయం మొత్తం నీటిలోనే ఉంది. భద్రాచలంలోని కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, అశోక్ నగర్ కాలనీ, శాంతి నగర్ కాలనీ, రామాలయం ఏరియా ప్రాంతాలకు వరద నీరు చేరడంతో కాలనీవాసులను ఇల్లు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించార అధికారులు.వరద నీటిలో స్నాన ఘట్టాలు, కళ్యాణకట్ట ప్రాంతం పూర్తిగా మునిగి పోయాయి.
భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అన్ని రహదారుల్లో వరద నీరు చేరింది. 4 రోజులుగా భద్రచలానికి ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.గోదావరి వంతెనపై గురువారం సాయంత్రం నుంచి రాకపొకలు నిలిపివేశారు అధికారులు. భద్రాచలం నుంచి ఆంధ్రా, చత్తిస్ గఢ్, ఒడిశాలకు వెల్లే ప్రయాణికులు రహదారి సౌకర్యం లేక 4 రోజుల నుంచి భద్రాచలంలోనే నిరీక్షిస్తున్నారు. దుమ్ముగూడెం, బూర్గం పాడు, చర్ల మండలాల్లో ముంపునకు గురైన అనేక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నీటిమట్టం 70 అడుగులకు చేరితే గోదావరి పట్టణం మొత్తం జలమయం కానుంది. గురువారం సాయంత్రం నుంచే భద్రాచలం వచ్చే అన్ని దారులు మూసివేశారు. 1986 తర్వాత గోదావరి బ్రిడ్జిని క్లోజ్ చేశారు. 48 గంటల పాటు ఎవరూ భద్రాచలం రావొద్దని పోలీసులు హెచ్చరించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోనే ఉండి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.
భద్రాచలం దిగువన పోలవరం, ధవలేశ్వరంలోనూ గోదావరి డేంజర్ జోన్ లో ప్రవహిస్తోంది. పోలవరం దగ్గర శుక్రవారం ఉదయానికి 18 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ఇక ధవళేశ్వరంలో గోదావరి నీటిమట్టం 18.5 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 18.25 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సాయంత్రానికి ధవళేశ్వరంలో గోదావరి వరద ప్రవాహం 25 లక్షల క్యూసెక్కులు దాటుతుందని అంచనా వేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గోదావరి జిల్లాల పరిధిలోని దాదాపు 100 లంక గ్రామాలు నీట మునిగాయి. ముంపు బాధితులను సహాయకేంద్రాలకు తరలించారు. జూలై నెలలోనే ధవళేశ్వరంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం చరిత్రలో ఇదే తొలిసారి అని అంటున్నారు. గోదారమ్మ ఉగ్రరూపంలో లంక గ్రామాలు ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. శాంతించాలని గోదారమ్మ తల్లికి పూజలు చేస్తున్నారు.
Read also: Sushmita Sen Dating: మరోసారి ప్రేమలో పడ్డ సుష్మితా సేన్.. ఈసారి మాజీ ఐపీఎల్ చైర్మన్‌తో..!
Read also: Heavy Rains in Telangana : ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి.. ఆ 4 జిల్లాల్లో హై అలర్ట్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook