Godavari Floods: తెలంగాణలో వారం రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో వరదలు పోటెత్తుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా జూలై నెలలోనే గోదావరి ఉగ్రరూపం దాల్చింది. బాసర నుంచి భద్రాచలం, పోలవరం మీదుగా ధవశేశ్వరం వరకు గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
Godavari Floods: అఖండ గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. గంట గంటకూ వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలంలో 54 అడుగులకు చేరువలో ఉన్న గోదావరి వరద..మూడు ప్రమాద హెచ్చరికల్ని దాటేసింది.
Godavari Floods: గత 3 రోజులుగా ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉగ్ర రూపం దాలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు ఎప్పుడూ లేని విధంగా జూలైలోనే ఆకస్మికంగా భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది. పోలవరం స్పిల్ వే దగ్గర గోదావరి నీటిమట్టం 29.4మీటర్లకు చేరింది.
Godavari Floods: గోదావరి నదికి భారీ వరద పోటెత్తుతోంది. నదీ పరివాహక ప్రాంతంల కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక దిశగా..భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక జారీ అయింది.
Telangana Rains:తెలంగాణలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా.. పలు జిల్లాలో కుంభవృష్టి కురిసింది. జూలై చరిత్రలోనే గతంలో ఎప్పుడు లేనంత వర్షం కురిసింది. గత 24 గంటల్లో భూపాలపల్లి జిల్లా ముత్తారం మహజదేవ్ పూర్ లో 35 సెంటిమీటర్ల వర్షం కురిసింది ఇంటే వర్ష బీభత్సం ఎలా ఉందో ఊహించవచ్చు.
Godavari Floods: గోదావరి ఎరుపు రంగు సంతరించుకుంది. ఎర్రటి నీళ్లతో ఉరకలెత్తుతూ ప్రమాదపు హెచ్చరికలు జారీ చేస్తోంది. వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో తొలి ప్రమాద హెచ్చరిక జారీ అయింది.
గోదావరి ఉపనది శబరిలో ప్రమాదం చోటుచేసుకుంది. వరద ఉధృతిలో ముగ్గురు గల్లంతయ్యారు. శబరి నదీ ప్రవాహంలో ఓ లాంచీ ..వంతెనను ఢీ కొట్టడంతో రెండు ముక్కలైపోయింది. లాంచీలో ప్రయాణిస్తున్న ముగ్గురు గల్లంతయ్యారు
వరద ప్రభావిత గోదావరి జిల్లాల్లో ( Flood effected Godavari districts ) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. అటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరద పరిస్థితుల్ని సమీక్షించారు. ముంపు బాధిత ఇళ్లకు తక్షణ సహాయం కింద రెండు వేల రూపాయలు అందించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లోని భారీవర్షాలు ( Heavy rains ), వరద ( Floods ) పరిస్థితులపై ప్రతిపక్షనేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తక్షణం సహాయక చర్యలు తీసుకోవల్సిందిగా సీఎం జగన్ ను కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangana cm kcr ) అప్రమత్తమయ్యారు. ఎక్కడా ప్రాణనష్టం, ఆస్థినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గోదావరి నది ( Godavari river ) మహోగ్రరూపం దాల్చేస్తోంది. భారీగా వచ్చి చేరుతున్న వరదతో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ ( Dowlaiswaram Barriage ) వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నుంచి 19 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలో వదులుతున్నారు.
గోదావరి వరద ( Godavari flood ) పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని..లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు.
గోదావరి వరద ( Godavari Flood ) ఉధృతి మరింతగా పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఉగ్రరూపం దాలుస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ ( Dowlaiswaram barriage ) వద్ద రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి నది..మరింత పెరగవచ్చని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.