Telangana Rains and Floods : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగుతోంది. రాష్ట్రంలో భారీ వర్షాలకు తోడు, ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి భారీ వరద పోటెత్తుతుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో గోదావరిపై ఉన్న కడెం, ఎల్లంపల్లి, కాళేశ్వరం తదితర ప్రాజెక్టులన్నింటికీ భారీ ఇన్‌ఫ్లో ఏర్పడింది. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో గోదావరిఖని-మంచిర్యాల పట్టణాల మధ్య ఉన్న గోదావరి బ్రిడ్జి పైకి కూడా వరద నీరు చేరింది. 1995 తర్వాత ఈ బ్రిడ్జి పైకి వరద నీరు చేరడం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు.
మహారాష్ట్రకు వెళ్లే ప్రధాన మార్గాల్లో ఈ మార్గం ఒకటి. ప్రస్తుతం గోదావరిఖని-మంచిర్యాల బ్రిడ్జి పైకి వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు ఇందారం, అటు గోదావరిఖని బస్టాండ్ ప్రాంతాల్లోనే వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో వందలాది వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. గోదావరి వరదలతో గోదావరిఖని ప్రాంతంలోని ఉదయ్ నగర్, సప్తగిరి కాలనీలు నీట మునిగాయి. మంచిర్యాలలో గోదావరిని ఆనుకున్న ఉన్న కాలనీల్లోకి భారీ వరద చేరింది.
డేంజర్ జోన్‌లో మంథని :
పెద్దపల్లి జిల్లా మంథని జలదిగ్భంధంలో చిక్కుకుంది. ఓ వైపున గోదావరి, మరోవైపు బొక్కల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొన్ని కాలనీలు నీట మునిగాయి. పట్టణంలోని అంబేడ్కర్ నగర్, మర్రివాడ, పాత పెట్రోల్ బంక్ ఏరియా, లైన్ గడ్డ, గ్రాప పంచాయితీ ఏరియా, గొల్లగూడెం, భగత్ నగర్, హుస్సేనీపురా, రజక వాడ, నాయి బ్రాహ్మణ వీధి, దొంతుల వాడ నీట మునిగాయి. మంథనికి దిగువన బొక్కల వాగు నీరు గోదావరి నదిలో కలుస్తుంది. కానీ గోదావరి నదిలో ప్రవహం తీవ్రంగా ఉండడంతో బొక్కలవాగు నీరు వెనక్కి వస్తోంది.దీంతో మంథని, కాటారం రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా మంథని పట్టణానికి ఇతర గ్రామాలకు సంబంధాలు లేకుండా పోయాయి. వరద ఉధృతి తగ్గితే తప్ప సాధారణ పరిస్థితులు నెలకొనేలా కనిపించడం లేదు.
Also Read: Hyderabd Rains: భారీ వర్షాలకు కూలిపోయే స్థితిలో పాత భవనాలు.. కూల్చివేతలు చేపడుతున్న జీహెచ్ఎంసీ
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook