Harish Rao Review: వరదల నేపథ్యంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్యులతో మంత్రి హరీష్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి పరివాహక వరద ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. వైద్యులంతా అందుబాటులో ఉండాలని..సెలవులు రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు.
ముంపు ప్రాంతాల్లో తప్పనిసరిగా డ్యూటీలు నిర్వహించాలన్నారు. ఆయా గ్రామాల్లో హెల్త్ క్యాంపుల్లో పరీక్షలు తరచూ నిర్వహిస్తూ..మందులను పంపిణీ చేయాలని అధికారులకు మంత్రి హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. కొత్తగూడెం కేంద్రంగా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్‌రెడ్డి మంచిర్యాల కేంద్రంగా విధులు నిర్వహించనున్నారు. హెల్త్ క్యాంపుల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలని..అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.
మరోవైపు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు తరలివస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి పరుగులు పెడుతోంది. రానున్న గంటలో క్రమేపి వరద ప్రవాహం తగ్గుతుందని..దీంతో భద్రాచలం వద్ద నీటమట్టం తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఐనా ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
Also read:Godavari Floods LIVE:భద్రాచలం సేఫేనా?మరో నాలుగు గంటలు గడిస్తేనే.. రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే..
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోసారి రెయిన్ అలర్ట్..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook