Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజులలో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Kalvakuntla Kavitha Slams Sonia Gandhi: ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి సోనియా గాంధీ ఎందుకు ప్రస్తావించలేదు అని సూటిగానే ప్రశ్నించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత... చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మీకు జాతీయంగా ముఖ్యమైన సమస్యలా అనిపించలేదా అని నిలదీశారు.
Delhi Excise Policy Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుని ప్రభావితం చేసేందుకు సీనియర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టినట్టుగా దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. తన హోదాను అడ్డం పెట్టుకుని ఈ కేసు విచారణలో లిక్కర్ వ్యాపారి అమన్ దీప్ ధల్ పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ. 5 కోట్ల ముడుపులు తీసుకున్నారనే అభియోగాల కింద ఈడీ ఉన్నతాధికారిపై సీబీఐ ఈ కేసు నమోదు చేసింది.
Delhi Liquor Scam Case latest news updates: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా ఈడీ దాఖలు చేసిన నాలుగో చార్జ్ షీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా అనేక అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తమ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సైతం ఈడీ కోర్టుకు సమర్పించినట్టు సమాచారం అందుతోంది. ఆ డీటేల్స్ క్లుప్తంగా..
CBI Summons Arvind Kejriwal: తాజాగా ఈ మెయిల్ ద్వారా పలు కీలక అంశాలు వెల్లడించిన సుకేష్ చంద్రశేఖర్.. ఢల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి సీబీఐ నోటీసులు అంశాన్ని సైతం అందులో ప్రస్తావించాడు. అరవింద్ కేజ్రీవాల్ కూడా తీహార్ జైలుకి రావాల్సిందే అంటూ సుకేష్ చంద్రశేఖర్ ఇచ్చిన లీక్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణను మరింత హీటెక్కిస్తున్నాయి.
CBI Summons Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైల్లో ఉన్న సమయంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి కూడా ఇదే కేసులో సీబీఐ నోటీసులు జారీచేయడం చర్చనియాంశమైంది.
Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీ ప్రతినిధులు ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇద్దరినీ ఈడీ విచారించనుంది.
Delhi liquor Scam Case: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత సుదీర్ఘ విచారణ ముగిసింది. కవిత ఈసారి అరెస్ట్ అవుతుందనే ఊహాగానాలకు తెరపడింది. ఉత్కంఠత ముగిసింది. ఇవాళ మరోసారి విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు జారీ చేసింది.
TSPSC Paper Leakage Case: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కార్యకర్తల మనోభావాలను గాలికొదిలేసిన కేసీఆర్ ఇవాళ కార్యకర్తలకు లేఖ రాసిన తీరే ఎన్నో సందేహాలను తావిచ్చిందన్నారు. కేసీఆర్ కార్యకర్తలకు రాసిన లేఖను ఉద్దేశిస్తూ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
Bandi Sanjay Press Meet: తన విషయంలో మహిళా కమిషన్ లీక్ ఇచ్చినట్లుగా తాను భావించడం లేదన్న బండి సంజయ్.. మీడియాకు లీకుల పేరుతో జరుగుతున్న ప్రచారంపై మహిళా కమిషనే వివరణ ఇవ్వాలి అని పేర్కొన్నారు. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు స్పందిస్తూ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చాను అని తెలిపారు.
ED Files Caveat Petition in SC: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తమపై చేసిన ఆరోపణలకు అదే కోర్టులో సమాధానం ఇవ్వాలనే దృఢ నిశ్చయంతోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సైతం కెవియట్ పిటిషన్ రూపంలో తమ వైఖరిని చాటుకున్నారు.
Kishan Reddy Fires On BRS MLC Kalvakuntla Kavitha: మద్యం స్కామ్‌లో చిక్కుకుని ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ పరువు తీశారని కిషన్ రెడ్డి విమర్శించారు. అక్రమంగా వ్యాపారం చేసి తల దించుకునేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల గురించి అడిగే నైతిక హక్కు ఉందా..? అని ప్రశ్నించారు.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణతో కేంద్రానికి ఏం సంబంధం ఉందన్నారు. తెలంగాణ నేతలే ఢిల్లీకి వచ్చి లిక్కర్ వ్యాపారం చేశారని.. అక్రమాలు జరిగాయని తేలితే విచారణ జరపగా కల్వకుంట్ల ఫ్యామిలీ లింకులు బయటకి వచ్చాయన్నారు.
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తాజాగా విజయ్‌నాయర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కుంభకోణంలో ప్రభుత్వంలోని పెద్దలకు 100 కోట్లు రూపాయలు అడ్వాన్స్ చెల్లింపులు జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు.
Delhi liquor scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డి భార్య కనికా రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. సుమారు ఆర గంటకు పైగా అనేక విషయాలపై ఈడీ ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. ‘జెట్ సెట్ గో’ సంస్థ ద్వారా కనికా రెడ్డి ప్రత్యేక విమానాలు నడుపుతున్నారు.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబులను కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకు విన్నవించుకోగా.. విచారణ పేరుతో రాజకీయ కక్ష సాధిస్తున్నారని శరత్ చంద్రా రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.