Delhi liquor Scam Case: ముగిసిన కవిత విచారణ, ఇవాళ మరోసారి ప్రశ్నించనున్న ఈడీ

Delhi liquor Scam Case: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత సుదీర్ఘ విచారణ ముగిసింది. కవిత ఈసారి అరెస్ట్ అవుతుందనే ఊహాగానాలకు తెరపడింది. ఉత్కంఠత ముగిసింది. ఇవాళ మరోసారి విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు జారీ చేసింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 21, 2023, 06:29 AM IST
Delhi liquor Scam Case: ముగిసిన కవిత విచారణ, ఇవాళ మరోసారి ప్రశ్నించనున్న ఈడీ

Delhi liquor Scam Case: దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి వెలుగు చూసిన మనీ లాండరింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత రెండవ ఈడీ విచారణ పూర్తయింది. 11 గంటల సుదీర్ఘ సమయం విచారణ తరువాత తిరిగి ఇవాళ మార్చ్ 21న విచారణకు హాజరుకావల్సిందిగా ఈడీ కోరింది.

ఈడీ ఎమ్మెల్సీ కవితను ఈసారి ఈ కేసులో నిందితుడైన అరుణ్ పిళ్లైతో కలిపి నిన్న మద్యాహ్నం వరకూ ఈడీ కవితను విచారించింది. ఇరువురినీ ఒకేసారి విచారించి ప్రశ్నల వర్షం కురిపించింది. పిళ్లైను రిమాండ్‌కు తరలించాక తిరిగి కవిత విచారణ ప్రారంభమైంది. రాత్రి వరకూ విచారణ కొనసాగింది. దాదాపు 11 గంటల విచారమ అనంతరం కవిత విక్టరీ సింబల్ చూపిస్తూ బయటకు వచ్చారు. ఇవాళ మరోసారి విచారణకు హాజరుకావల్సి ఉంది.  

నాటకీయ పరిణామాల మధ్య ఈడీ విచారణకు హాజరైన కవిత

ఢిల్లీ మద్యం కేసులో ఈడీ రెండవ దఫా విచారణకు ఎమ్మెల్సీ కవిత ఈనెల 16 వతేదీనే హాజరుకావల్సి ఉంది. కానీ తన స్థానంలో తన న్యాయవాదిని పంపి తాను దాఖలు చేసిన పిటీషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున ఈనెల 24వ తేదీన తీర్పు వెలువడేవరకూ సమయం ఇవ్వాలని కోరారు. కానీ ఈడీ మాత్రం ఈ నెల 20 అంటే ఇవాళ విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు పంపింది. ఈ నేపధ్యంలో ఆమె విచారణకు హాజరౌతారా లేదా అనేది సందేహంగా మారింది. ఒకవేళ హాజరైతే పర్యవసానం ఎలా ఉంటుంది, హాజరుకాకపోతే ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయంపై న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించి చివరకు విచారణకు హాజరయ్యారు. 

భర్త అనిల్, న్యాయవాది భరత్, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ఈడీ ఆఫీసుకు వెళ్లారు. పీఎంఎల్ఏ సెక్షన్ 50  ప్రకారం ఈడీ అధికారులు దాదాపు 5 గంటలుగా కవితను విచారిస్తున్నారు. ఢిల్లీ ,హైదరాబాద్ సమావేశాల్లో చర్చకొచ్చిన వివిధ అంశాలపై కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ముఖ్యంగా మనీ లాండరింగ్ వ్యవహారంలో కవితపై ప్రధానంగా ఆరోపణలున్నాయి. వీటికి సంబంధించి వివరణ కోరుతూ పలు కీలకాంశాలపై ఈడీ ప్రశ్నించింది. ముఖ్యంగా కేసులో నిందితుడైన అరుణ్ పిళ్తైతో కలిపి విచారణ కొనసాగించడం గమనార్హం.

ఈడీ ప్రశ్నించిన అంశాలివే

ఢిల్లీ మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ వ్యవహారంతో పాటు మద్యం కుంభకోణంలో ఆమె పాత్ర, నిందితులతో ఆమెకున్న సంబంధాలు, ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత వాటాలు, 100 కోట్ల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడీ ప్రశ్నించినట్టు సమాచారం. అదే సమయంలో అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు స్టేట్‌మెంట్ ఆధారంగా కూడా కవితను ఈడీ వివరాలు అడిగి తెలుసుకుంది. ఇండో స్పిరిట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారా లేదా, విజయ్ నాయర్‌ని 2021 మార్చ్ 19,20 తేదీల్లో కలిశారా లేదా, సిసోడియాను కలిశారా, మాట్లాడారా వంటి విషయాలపై సమాధానం రాబట్టేందుకు ఈడీ ప్రయత్నించింది. మరోసారి విచారణకు పిలిచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

ఈడీ ఆఫీసు బయట హై టెన్షన్ 

విచారణ ముగిసిన తరువాత ఈడీ కవితను అదుపులో తీసుకుంటుందనే వార్తల నేపధ్యంలో హై టెన్షన్ నెలకొంది. ఓ వైపు విచారణ జరుగుతుండగా కవిత తరపు న్యాయవాదులు ఈడీ కార్యాలయానికి చేరుకోవడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన ఎక్కువైంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..విచారణ ముగిశాక తీసుకెళ్లేందుకు వచ్చామని ఆ న్యాయవాదులు తెలిపారు. ఆ న్యాయవాదులు చెప్పినట్టే నిన్నటి విచారణ ముగిసినా..తిరిగి ఇవాళ కవిత ఈడీ విచారణకు హాజరుకావల్సి ఉంది. 

Also read: Delhi liquor Scam Case: 5 గంటలుగా ఎమ్మెల్సీ కవిత విచారణ, అరుణ్ పిళ్లైతో కలిపి కవితపై ఈడీ ప్రశ్నల వర్షం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News