CBI Summons Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని సైతం విచారణకు హాజరు కావాల్సిందిగా పిలుస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. రేపు ఏప్రిల్ 15న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతిలో విచారణ ఎదుర్కొంటున్నారు.
మరోవైపు మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ హవాలా మార్గంలో భారీ మొత్తంలో నగదు తరలించినట్టు ఎప్పటికప్పుడు వాట్సాప్ చాట్స్, ఈమెయిల్స్ పేరిట కీలక అంశాలు లీక్ చేస్తున్నాడు. తాజాగా ఈ మెయిల్ ద్వారా పలు కీలక అంశాలు వెల్లడించిన సుకేష్ చంద్రశేఖర్.. ఢల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి సీబీఐ నోటీసులు అంశాన్ని సైతం అందులో ప్రస్తావించాడు. అరవింద్ కేజ్రీవాల్ కూడా తీహార్ జైలుకి రావాల్సిందే అంటూ సుకేష్ చంద్రశేఖర్ ఇచ్చిన లీక్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణను మరింత హీటెక్కిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : CBI Summons Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కి సీబీఐ నోటీసులు.. అసలేం జరుగుతోంది ?
ఈ నేపథ్యంలోనే రేపు సీబీఐ విచారణలో అరవింద్ కేజ్రీవాల్‌కి ఎలాంటి పరిణామాలు ఎదురు కానున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుండగానే తాజాగా బీజేపి అరవింద్ కేజ్రీవాల్‌కి ఓ సవాలు చేసింది. మీకు దమ్ముంటే, లై డిటెక్టర్ టెస్ట్‌కి అంగీకరించాల్సిందిగా బీజేపి ఛాలెంజ్ చేసింది. గతంలో వివిధ పార్టీల నేతలపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ స్పందించిన తీరును ప్రస్తావించిన బీజేపి జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే అరవింద్ కేజ్రీవాల్ తనే సొంతంగా లై డిటెక్టర్ టెస్టుకి ముందుకు రావాలని సవాల్ చేశారు.
ఇది కూడా చదవండి : Delhi Liquor Scam Case: సుప్రీంలో వాడివేడిగా వాదనలు, కవితకు నిరాశ, మూడు వారాలు వాయిదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK