Congress is upset over the disqualification of Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై ఆ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆయన అనర్హత వేటుపై న్యాయపోరాటంతో పాటు రాజకీయంగాను పోరాడుతామని చెప్పి రెండు రోజులుగా పోరాటం చేస్తోంది.
TPCC Chief Revanth Reddy: చంద్రబాబు నాయుడు ఆనాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని 51% ప్రయివేటుపరం చేస్తుంటే అడ్డం పడ్డాను అని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ మరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదే ఫ్యాక్టరీని మూసేస్తే పోచారం ఏం చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Revanth Reddy Slams KTR: బోధన్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ కులాలు, మతం పేరుతో ప్రజలను విభజించి పాలించాలని చూస్తున్నారు అని మండిపడ్డారు.
BJP Leaders Comments On Bandu Sanjay: తెలంగాణ ప్రతిపక్ష పార్టీ నాయకుల్లో ముసలం నెలకొంది. అధికార పార్టీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేయాల్సింది పోయి. సొంత పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షులనే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. భవిష్యత్‌లో అసంతృప్తి నేతల దారేటు..? వీరి వ్యాఖ్యల వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నారా..?
Revanth Reddy : తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదలకు మేలు జరుగుతుందని, కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ బెదిరిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో అన్నాడు.
Congress Dharani Guarantee Card: ధరని పోర్టల్ సమస్యలపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకునేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “కాంగ్రెస్ హామీ కార్డు” పేరుతో కార్డులు జారీ చేసి.. ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకోనుంది.
Revanth Reddy Karimnagar Speech: 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి 2004 లో ఇదే గడ్డపై నుంచి తెలంగాణ ఇస్తామని తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ మాట ఇచ్చారు. మాట తప్పక మడమ తిప్పకుండా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
Revanth Reddy Slams KCR : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు 40 ఏళ్ల కింద ఇక్కడ లగ్గం అయిందని చెప్పిండు. అప్పట్లో ఆయనకు ఇక్కడ లగ్గం అయిందో లేదో తెలియదు కానీ... వేములవాడ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆయన లగ్గం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు " అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Jaggareddy Interesting Comments on Meeting KCR: సంగారెడ్డిలో అంగన్వాడీ వర్కర్స్ ధర్నా సందర్భంగా వారికి సంఘీభావం ప్రకటిస్తూ ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కేసీఆర్‌ని కలిసిన మరుక్షణం నుండే తాను పార్టీ మారుతున్నట్లు లేనిపోని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది, లేనట్టు.. లేనిది, ఉన్నట్టు పుకార్లు షికార్లు చేస్తాయని.. కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Revanth Reddy Speech In Warangal : తెలంగాణ ఉద్యమం సమయంలో ఏమీ లేని బిఆర్ఎస్ నేతలు ఇవాళ కోట్లకు పడగలెత్తారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా దండుపాళ్యం బ్యాచేనని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
BRS MLA Jeevan Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ గుమ్మటాలు కూలుస్తా అని అంటున్నాడు. ప్రభుత్వం నిర్మించిన కట్టడాలను కూలిస్తే ప్రజలు ఆ పార్టీని భూమిలో పాతి పెడతారు అనే విషయం మర్చిపోవద్దు అని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
Revanth Reddy Padayatra: హాత్ సే హాత్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. " పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజకీయంగా బొంద పెట్టాల్సిన బాధ్యత తెలంగాణా సమాజంపై ఉందని అన్నారు.
MIM Chief Asaduddin Owasi: తెలంగాణలో 50 స్థానాల్లో పోటీపై అసదుద్దిన్ ఒవైసి మాట్లాడుతూ .. అక్టోబర్ వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అని బదులిచ్చారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం గురించి స్పందిస్తూ.. కేసీఆర్ దేశంలోనే తాజ్ మహల్ కంటే అందమైన సెక్రటేరియట్‌ని నిర్మించారు అని వ్యాఖ్యానించారు.
Revanth Reddy Slams KCR: ప్రగతి భవన్ని నక్సలైట్లు పేల్చేయాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు తప్పుపడుతూ ఎదురుదాడికి దిగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరోసారి తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మరోసారి వర్గ పోరు భగ్గుమంది. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బీఎల్ఆర్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కార్యకర్తలు కొట్టుకున్నారు.
కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావటమే తన లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మేడారంలో వేసిన ఈ అడుగు కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే అని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా టీపీసీసీ చేపడుతున్న హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో భాగంగా సోమవారం ములుగు నియోజకవర్గం పరిధిలోని పస్రా గ్రామంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
AAP on MP Elections: ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు పెంచుతోంది. త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నామని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఆందోళన రేపుతోంది.
కర్ణాటక ఎగువ భద్ర ప్రాజెక్ట్‌తో రాయలసీమ ఎడారిగా మారుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడంతో తెలుగు రాష్ట్రాలకు నీటి కష్టాలు తప్పవన్నారు. జగన్ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
Revanth Reddy Comments On Budget 2023 :కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023 పై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఏరకంగా చూసినా కేంద్ర బడ్జెట్ పేద ప్రజలకు ఆశాజనకంగా లేదని.. మోదీ సర్కారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాన్ని నిలదీయకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అండగా నిలబడిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఈ యాత్ర సోమవారం ముగియాల్సి ఉంది. అయితే ఒకరోజు ముందు ఆదివారమే ముగించారు. శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.