TPCC Chief Revanth Reddy: పోచారం కుటుంబసభ్యులు ఓ దండుపాళ్యం ముఠా సభ్యులు

TPCC Chief Revanth Reddy: చంద్రబాబు నాయుడు ఆనాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని 51% ప్రయివేటుపరం చేస్తుంటే అడ్డం పడ్డాను అని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ మరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదే ఫ్యాక్టరీని మూసేస్తే పోచారం ఏం చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2023, 04:46 AM IST
TPCC Chief Revanth Reddy: పోచారం కుటుంబసభ్యులు ఓ దండుపాళ్యం ముఠా సభ్యులు

TPCC Chief Revanth Reddy: గతంలో బాన్సువాడ ప్రాంత సమస్యలపై కొట్లాడిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కేసీఆర్ తో సావాస దోషం తరువాత పూర్తిగా మారిపోయారు. పోచారం కుటుంబ సభ్యులు ఇప్పుడు ఇక్కడ దండుపాళ్యం ముఠా సభ్యులుగా మారి బాన్సువాడను దోచుకుంటున్నారు. ఇసుక దందా వారిదే.. ఇక్కడ క్రషర్లు వారివే. తమ్ముడిని ఊరు మీదకు వదిలేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కొడుకులకు దోచుకోవడానికి మండలాలను పంచి ఇచ్చిండు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తన పాదయాత్రలో భాగంగా సోమవారం బాన్సువాడలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అయిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణలో బీఆర్ఎస్ పరిపాలన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు చూస్తోంటే.. మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా.. నిజాం కాలంలో ఉన్నామా అనే సందేహం వస్తోంది. ఆనాడు భూమి శిస్తు కట్టకపోతే రజాకార్లు ఏది దొరికితే అది గుంజుకపోయేవారు... అలాగే ఈనాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కొడుకు చైర్మన్ గా ఉన్న బ్యాంకు సిబ్బంది రుణం కట్టలేదనే కారణంతో రైతు ఇంటి తలుపులు, ల్యాప్ టాప్ ఎత్తుకెళ్లారు అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. 

చంద్రబాబు నాయుడు ఆనాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని 51% ప్రయివేటుపరం చేస్తుంటే అడ్డం పడ్డాను అని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ మరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదే ఫ్యాక్టరీని మూసేస్తే పోచారం ఏం చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2021లో బాన్సువాడ పరిధిలో 8000 ఎకరాల పంట నష్టం జరిగింది. రైతులకు పరిహారం ఇస్తానని చెప్పిన కేసీఆర్ సర్కారు ఇప్పటి వరకు ఇవ్వలేదు. నష్టపోయిన రైతులను ఆదుకునే బాధ్యత పోచారం శ్రీనివాస్ రెడ్డిపై లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

రాష్ట్రంలో రైతులు బాగుపడాలంటే బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉరేయాల్సిందే అని స్పష్టంచేశారు. బాన్సువాడలో స్థానిక సమస్యలకు పరిష్కారం లభించాలంటే.. వచ్చే ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డిని పాతాళంలో పాతిపెట్టాల్సిందే అని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ఎంతటి వారినైనా మెడలు వంచి గద్దె దించే శక్తి ఈ ప్రాంత రైతులకు ఉంది. షుగర్ ఫ్యాక్టరీని మూసేసిన కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన బాధ్యత మీపై ఉంది అని బాన్సువాడ ప్రాంత రైతులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తాం. రైతులు పండించే ప్రతీ పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఎమ్మెల్యేలను నియంత్రించగలిగే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి... తన కొడుకులను మాత్రం నియంత్రించలేకపోతున్నారు. బాన్సువాడకు పట్టిన పీడ విరగడ కావాలంటే ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి బొందపెట్టాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఉచితంగా ఇస్తాం అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 5లక్షల వరకు ఉచిత వైద్య సహాయం అందిస్తాం. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం అని స్పష్టంచేసిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోపే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. పేదలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటాం అని రేవంత్ రెడ్డి బాన్సువాడ సాక్షిగా ఎన్నికల హామీలను గుప్పించారు.

ఇది కూడా చదవండి : TSPSC Paper Leakage Case: బీజేపీ అధికారంలోకి వస్తే.. బండి సంజయ్ బహిరంగ లేఖ

ఇది కూడా చదవండి : Delhi liquor Scam Case: 5 గంటలుగా ఎమ్మెల్సీ కవిత విచారణ, అరుణ్ పిళ్లైతో కలిపి కవితపై ఈడీ ప్రశ్నల వర్షం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News